Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ద్వారాంపూడి కౌంటర్ బినామీలను కాపాడుకో బాబు…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– అప్పులు చేస్తున్నది సంక్షేమ పథకాల కోసమే…
– చంద్రబాబుకు మానసిక పరిస్థితి బాగోలేదు…
ద్వారాంపూడి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

తనపై గానీ తన పార్టీ అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పై గానీ వ్యక్తిగత విమర్శలు మాని,మీ యొక్క బినామీలను కాపాడుకోవాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నగర శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కాకినాడ వచ్చిన చంద్రబాబు నాయుడు జగన్ సైకో అని, చంద్రశేఖర్ రెడ్డి అతని బినామీ అంటూ వ్యక్తిగత దూషణలు చేసినట్లు సమాచారం ఈ నైపధ్యంలో చంద్రశేఖర్ రెడ్డి శనివారం సాయంకాలం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ బియ్యం దందా, మట్టి దందా అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తే అతని మానసిక పరిస్థితి అర్థం అవుతోందని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. వైసిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కోసం అప్పులు చేస్తోంది గానీ, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులు సుజనా చౌదరి, సియమ్ రమేష్, వివిధ మీడియా పేర్లు మీద బినామీలు స్వాహా చేసారని అన్నారు. తమ కుటుంబం 1986నుండి ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని,1982లోనే మాకు 3లక్షల వైర్ హౌస్ గోదాంలు ఉన్నాయని తెలియజేశారు. రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో తెలపాలని డిమాండ్ చేసారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 117 పధకాలను పేద ప్రజలకు అందచేస్తున విధానం చూసి చంద్రబాబు నాయుడు కడుపు మంటతో రగిలిపోయి, అనేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. కాకినాడలో డ్రగ్స్ మాఫియా, రౌడీయిజం మాజీ శాసనసభ్యుడు కొండబాబు సమయంలో విపరీతంగా పెరిగిపోయాయని, తనకు రౌడీయిజం అంటే ఏమిటో తెలీదు అన్నట్టుగానే ఎద్దేవా చేశారు. నీకు రేపు అనే రోజు ఒకటి మాత్రమే ఉందని, మాకు రేపు, ఎల్లుండి కూడ ఉందని, మీ ఆటలు, లోకేష్ ఆటలు సాగనీయమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర మేయర్ శివ ప్రసన్న, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement