Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తెలుగు వీర లేవ రా…. దేశాన్ని బీజేపీ నుండి కాపాడుకో రా….

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
– ఘనంగా అల్లూరి సీతారామరాజు కు నివాళులు
– సామ్రాజ్యావాదం, మతోన్మాదం నశించలంటూ సీపీఐ నినాదాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ , విశ్వం వాయిస్ః

తెలుగు జాతి స్ఫూర్తి ప్రదాత ,మన్యం ఆరాధ్య నేత ,స్వాతంత్ర సమర యోధుడు ,బ్రిటిష్ పాలన అంతం కోసం విశాఖ గోదావరి మన్యం ప్రాంతంలో పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు స్థానిక నాగమల్లి తోట జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ముందు ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జీ లోవ రత్నం ఆధ్వర్యంలో సామ్రాజ్యవాదం ,మతోన్మాదం నశించాలి ప్రజాస్వామ్యాన్ని లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వర్ధంతిని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ తెల్లదొరలు
ఈ దేశాన్ని వదిలిపోవాలని 1922 ఆగస్టు నుండి 24 జూన్ వరకు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ను గడగడ లాడించే విధంగా పోరాటం చేశారని ఆయన గుర్తుచేశారు.ఈ పోరాటం స్వాతంత్రోద్యమ చరిత్రలో మన్యం పోరాటంగా ప్రాచుర్యం పొందిందని అన్నారు. సీతారామరాజు కల కన్నా ఆయన ఆశయాలు లక్ష్యాలు నేటికీ నెరవేరలేదని అన్నారు. తెల్లదొరలు పోయి నల్లదొరలు పాలన వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. నేడు ఉన్న బిజెపి ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదులకు మరింత చేరువై దేశ సంపదను సామ్రాజ్యవాదులకు కట్టబెట్టే విధానాలతో దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుంది అన్నారు . ఆదివాసుల అటవీ హక్కులు చట్టాలున్నప్పటికీ వారికి సాగుభూమి ,పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో సీతారామరాజు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆ లక్ష్య సాధన కోసం తెలుగువీర లేవరా దేశాన్ని బిజెపి నుండి కాపాడుకునే విధంగా ఉద్యమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు ,సిపిఐ నగర నాయకులు ఎం సత్యనారాయణ ఎమ్మెస్ ,జిల్లా సమితి సభ్యులు అప్పలరాజు ,ఏ ఐ టి యు సి నగర ఉపాధ్యక్షులు బొబ్బిలి సత్యనారాయణ, రాజేష్ ,ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కాశీ విశ్వనాథ్ ,రవి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement