WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అభిరుద్ది చేతకాని.. బూతులు ఎమ్మెల్యే ద్వారాంపూడి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

నీ.. నాకుటుంబాల చరిత్ర మీడియాలో
మాట్లాడుకుందాం… వస్తావా
– దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ద్వారాంపూడి
– జ్యోతుల నవీన్, వనమాడి కొండబాబు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం న౦దు జ్యోతుల నవీన్ వనమాడి కొండబాబు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పెంచిన పన్నులను బాదుడుపై ప్రజలు పడుతున్న అవస్థలు కారణంగా శ్రీకాకుళం నుండి కాకినాడ వరకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాడుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినవి అన్ని వాస్తవాలని, వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు పట్ల అభిమానంతో ప్రజలు తరలి వఛ్చిరని, అది జీర్ణించుకోలేక ద్వారంపూడి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టిందే ద్వారంపూడిని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద బహిరంగ సభలో వ్యక్తిగత విమర్శలు చేసారని, రాజశేఖర్ రెడ్డి హయాంలో చంద్రబాబు పై 27 అక్రమ కేసులు పెట్టినా ఒక్కటి కూడ రుజువు కాలేదని, ఎమ్మెల్యే బ్రాండ్ అ౦టూ యేవీ కూతలు మాట్లాడుతున్నాడని,
ప్రపంచంలోనే ఆర్థిక నేరలకు అక్రమ వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ మోహన్ రెడ్డి అయితే ఉమ్మడి రాష్ట్రాల అభివృద్ధికి బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడని ప్రపంచానికే తెలిసని, ద్వారంపూడి కుటుంబ చరిత్ర కోసం నా కుటుంబ చరిత్ర కోసం మీడియా ముందు చర్చకు సిద్ధమని, దొంగ నోట్లు, పేకాట శిబిరాలు, దౌర్జన్యాలు దోపిడీలు ద్వారా డబ్బులు సంపాదించిన వ్యక్తి అనే సంగతి ప్రజలకు తెలుసనని, ద్వారంపూడి సింహచలం పాదయాత్ర దేని కోసం చేసాడో ప్రజలకు చెప్పాలని, నియోజకవర్గ అభివృద్ధి చేతకాని బూతులు ఎమ్మెల్యే ఎవరంటే ద్వారంపూడి అనీ రాష్ట్ర ప్రజలకు తెలుసని, జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు జనాలు ద్వారంపూడిని విమర్శించారు.
జ్యోతుల నవీన్ మాట్లాడుతూ
భాదుడే భాదుడే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు స్ధానిక నగర ఎమ్మెల్యే ద్వారంపూడిపై మాట్లాడినవి అన్ని వాస్తవాలని, దాని మీద ఎక్కడ అయినా చర్చకి సిద్ధమని, ఎమ్.ఎల్. ఏ. ద్వారంపూడి చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల అసామి ఇప్పుడు వేల కోట్లు ఆస్తులు వచ్చ్చాయి అనీ అన్నాడని వేల కోట్ల ఆస్తులు కోసం మీ జగన్ మోహన్ రెడ్డిలా ఆర్థిక మోసాలు చెయ్యలేదని, చంద్రబాబు నాయుడుకు ఆస్తులు ఎలా వచ్చ్చాయో ప్రతి సంవత్సరం అఫిడివిట్ లో బహిరంగగా తెలిపారని, 1972 లో సైకిల్ స్టోర్ పెట్టి 40 సంవత్సరల్లో వేల కోట్ల ఆస్తులు ద్వారంపూడి కుటుంబం ఎలా సంపాదించారో చెప్పాలని, డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టి అక్కడ మర్డర్ జరిగితే పారిపోయినా ద్వారంపూడి నేడు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని, సంక్షేమ పథకాలు పేరుతో లక్షల కోట్ల రూపాయిలు అప్పు చేసి దోచేసారని కాగ్ నివేదిక తప్పుపట్టినా సిగ్గురాలేదని, జిల్లాలో చేపల చెరువులు గ్రానెట్ కొండలు, మట్టి, మద్యం, ఇసుక, బియ్యం అన్ని అక్రమ వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి బినామీ అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డివేనని, తెలుగుదేశం పార్టీ హయాంలో 70% పోలవరం పూర్తి చేస్తే మీ వైసీపీ పార్టీ హయాంలో ఒక్క శాతం కూడ పూర్తి చెయ్యలేని పార్టీ వైసీపీ పార్టీ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పె౦కే శ్రీనివాస్ బాబా, పేరాబత్తుల రాజశేఖర్, మల్లెపూడి వీరు, మామిడాల వెంకటేష్, కాళ్ల సత్తిబాబు, తుమ్మల రమేష్, సీకోట అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement