చేసిన మజ్జిగ చలివేంద్రం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్ ): మండలం పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు గ్రామ సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా వారి ఆద్వర్యంలో ఆలమూరు గ్రామంలో స్థానిక బస్టాండ్ నందు గ్రామ సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా వారి ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ భర్త అయినటువంటి కుమార్ రాజా తల్లిదండ్రులు(నాతి నిర్మలా దేవి వీర్రాజు) వారి జ్ఞాపకార్థం మజ్జిగ చలి వేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా మాట్లాడుతూ ముందుగా మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి అమ్మ ఓ మార్గదర్శి మనం ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అనేది తెలుసుకోవడానికి ఏ పుస్తకాల్లోనో వెతకాల్సిన పని లేదు అమ్మే మార్గం. ఆమె జీవితమే మనకు సన్మార్గం ఆమ్మే ఆనందం, ఆమ్మే సంతోషం, ఆమ్మే అన్నీ. అలాంటి అమ్మకు ప్రతీక్షణం శుభాకాంక్షలు తెలియజేసిన సరిపోదు అని వివరించి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని వేసవిలో ప్రయాణికులు,బాటసారులకు చలివేంద్రం ద్వారా దాహార్తిని తీర్చడం ఎంతో తృప్తిని ఇచ్చిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, బాటసార్లు, డ్రైవర్లు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.