విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:
తొండంగి: మే10: విశ్వం వాయిస్ న్యూస్:
ఆసాని ప్రభావంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండల సముద్ర తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది .ఉదయం నుంచే ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది .సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.అద్దరి పేట, దానవాయిపేట, పెరుమాళ్ళపురం, సముద్రతీరంలో ఈదురుగాలులు,వర్షంతో బీభత్సం గా మారింది .తుఫాను కారణంగా ప్రజలు రహదారిపై జన సంచారం తగ్గింది. ఈ కారణంగా తుని, కోటనందూరు, తొండంగి మండలాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ కారణంగా అధికారులు అప్రమత్తమయ్యి హెచ్చరికలు జారీ చేసారు.