విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
జయలక్ష్మి ఎంఎఎం సొసైటీ డిపాజిటర్ల బాధితుల సమస్యపై స్ధానిక గాంధీభవన్లో వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల సమావేశం జరిగింది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి హాసన్ షరీఫ్ ఆధ్వర్యంలో అఖిల పక్ష నేతల సమావేశాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. బ్యాంకు బాధితుల సంఘం ప్రతినిధులు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
సొసైటీ బాధితులు మాట్లాడుతూ వడ్డీలతో వెయ్యి కోట్ల కుంభకోణం దాగి ఉందని అసలు మాత్రమే520 కోట్లుగా పేర్కొన్నారు. 100కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అరెస్టులు కాకుండా బ్యాంకు యాజమాన్యం పెద్ద ఎత్తున కుమ్మక్కు చేస్తున్న యధార్థం వెలుగులోకి రాకుండా జాగ్రత్తపడుతున్నారని పేర్కొన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దల వాటాలు వున్నాయని కేసును సిబిఐ దర్యాప్తు చేస్తే తప్ప న్యాయం జరగదని గగ్గోలు పెట్టారు. జయలక్ష్మి సొసైటీ భవనం వద్ద నిరసన శిబిరం కొనసాగిస్తూ అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు విషయం తెలియ జేస్తూ లేఖలు పంపాలని నిర్ణయించారు.
తాడేపల్లిలో డిజిపి, సహకార శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గవర్నర్లకు, న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి ప్రధాన మంత్రి రాష్ట్రపతి కార్యాలయాలకు అఖిలపక్షం బృందం లేఖగా సిబిఐ దర్యాప్తు కోరుతూ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వమ్ మే 16న స్వయంగా అందిస్తారని హాసన్ ప్రకటించారు.
బ్యాంకును దోచిన నేరస్తుల ఫోటోలతో లక్ష కరపత్రాలు ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. జయలక్ష్మి సొసైటీ గోల్ మాల్ వ్యవహారం చాప క్రింద నీరులా ఏడాది క్రితం నుండి జరుగుతున్నదని వీటిల్లో లోపాలను సొమ్ము చేసుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున జరగడం వలనే కేసు జాప్యం కావడానికి కారణాలుగా వేదిక అభిప్రాయపడింది. ఈ
సమావేశంలో దూసర్లపూడి రమణరాజు (పౌరసంక్షేమసంఘం), గంప లోవరత్నం (సిపిఐ), యెనిమిరెడ్డి మాల కొండయ్య (బిజెపి) ఎం సుబ్రమణ్యం( బిఎస్పి), ఆట్ల సత్యనారాయణ (జనసేన) నరాల శివ(ఆమ్ ఆద్మీ), ఏనుగుపల్లి కృష్ణ (బహుజన ఆర్మీ), సుబ్బు (భీమ్ ఆర్మీ), సబ్బారపు అప్పారావు, కొక్కిలిగడ్డ గంగరాజు, పెంకే నూకరాజు, రియాజ్ మహ్మద్ బాధితుల సంఘం ప్రతినిధులు బదిరీ నారాయణ, రమణ మూర్తి, సునీత, భీమారావు, రాఘవరావు, గణేష్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మురళీ మోహన్, పేరయ్య శాస్త్రి, నసీరుద్దీన్, సన్యాసి రాజు, సూర్యశంకరం, దయాసాగర్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం తరపున రాజకీయ పార్టీల ప్రతినిధిగా హాసన్ షరీఫ్, ప్రజా సంఘాల నుండి దుర్గా రమేష్, జయలక్ష్మి సొసైటీ బాధితుల సంఘంతో సమీక్షా సమన్వయంగా కార్యాచరణ జరుగుతుందని దూసర్ల పూడి రమణరాజు ప్రకటించారు.