పట్టు వస్త్రాలు సమర్పించారు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్) లో కేదర్లంక గ్రామంలో వెలసిన దనమ్మ అమ్మవారి ఉత్సవాలను గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు ఆధ్వర్యంలో ,ప్రజలు ఘనంగా నిర్వహించారు… విద్యుత్ దీపాలతో ఆలయ శోభ రంగురంగులతో కళకళలాడింది.. పెద్ద ఎత్తున బాణాసంచా, మంగళ వాయిద్యాలు తీన్మార్ డప్పులతో యువత కేరింతలతో సంబరం జరిగింది..
కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా , చుట్టుప్రక్కల గ్రామాల కే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు అనేక మంది వస్తుంటారు. ఆదివారం పర్వదినాన అమ్మవారికి
మొక్కలు,నైవేద్యాలు సమర్పిస్తారు…
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విధి వెంకట్ రెడ్డి బాబు మాట్లాడుతూ , గత ఆరు సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలు ను పట్టించుకోలేదని, తాను ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాను అన్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహించే ఊరి దేవత దన్నమ్మ తల్లి ని భక్తులు మొక్కుబడులను చెల్లించి ఘనంగా నిర్వహించారు. కొందరు భక్తులు శుక్రవారం నైవేధ్యాలను సమర్పించి గ్రామాన్ని చల్లగా కాపాడాలని భక్తులు వేడుకున్నారు.
అనంతరం భక్తులు ఊరేగింపులతో మరియు డప్పులతో కుటుంబ సమేతంగా అమ్మవారి దేవాలయం కి వెళ్లి నైవేద్యాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయo భక్తులతో కిటకిటలాడింది…. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామ సర్పంచ్ విధి వెంకట్ రెడ్డి బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు