విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సిఐ ఎమ్ వెంకటనారాయణ, ఆర్ టిఓ వి శ్రీనివాసు అన్నారు. బుధవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జాతీయ రహదారి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.ఈసందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాలు మేరకు ప్రతీరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని రోజు రోజుకు వాహన ప్రమాదాలు అధికమవుతున్నాయని ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే 10వేలు పైబడి ఫైన్,జైలు శిక్షలు తప్పవని వాహనచోదకులను హెచ్చరించారు. అలాగే ఆర్టీఓ మాట్లాడుతూ రోడ్డు భద్రత సూచనలు పాటించాలని ప్రతీఒక్కరు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని సూచించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేసారు.ఈకార్యక్రమంలో ఎస్ఐ భాను ప్రసాద్, మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్ కెవి నాగేంద్ర సిబ్బంది పాల్గొన్నారు…