WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం భారత దేశానికి దిక్సూచి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* దిశ అనువర్తనం ఉంటే జగనన్న తోడు ఉన్నట్టే
* సమాజంలో ఇంకా మార్పు రావాలి
* పిల్లలతో తల్లిదండ్రులు స్నేహం గా ఉండాలి
* మహిళలను గౌరవిస్తే నేరాలు తగ్గుతాయి
* వన్ స్టాప్ కేంద్రాల్లో దేశంలో ఆంద్రాయే అగ్రగామి
* మంత్రి రాజా, ఎంపీ గీత, కలెక్టర్ కృతికా వెల్లడి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 18, (విశ్వం వాయిస్ న్యూస్) ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన దిశ చట్టం భారత దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఆమోదం పొంది దిక్సూచిగా మారనుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) పేర్కొన్నారు. పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉండాలని భావించే స్థితికి మిగతా రాష్ట్రాలు వస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని మహిళలకు ప్రమాదాలు జరిగిన తర్వాత రక్షణ శాఖ అప్రమత్తం కావడం కంటే అసలు ప్రమాదాలు జరుగక ముందే అప్రమత్తమై రక్షణ కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘దిశ’ అనువర్తనంపై అవగాహన, భారీ నమోదు ప్రత్యేక ఏకైక కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపం రోడ్ఠు కూడలిలో ఓ ప్రైవేట్ స్థలంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్వహించారు. దిశ అనువర్తనం వినియోగం, ఉపయోగం గురించి యువతులు, మహిళలకు అవగాహన కల్పించే ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా రాజా మాట్లాడారు.

 

మహిళల ఆండ్రాయిడ్ ఫోన్లలో దిశ అనువర్తనం ఉంటే అక్క చెల్లమ్మలు అందరికీ జగనన్న తోడున్నట్టేనని మిగతా మహిళలకు అవగాహన కల్పించమని ఆయన సభికులకు పిలుపు నిచ్చారు. ఈ రాష్ట్ర మహిళలు అందరూ జగనన్నకు అండగా ఉండడానికీ, జగనన్న అండ తీసుకోడానికి ఈ రాష్ట్రంలోని మహిళలు అందరూ సంసిద్దంగా ఉన్నారనీ, ఈ విషయంలో ఏ సంకోచం వద్దని, గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్ళి వారి మనస్సును, వారి శ్రద్దను తాను తెలుసుకున్నానని, దిశ అనువర్తనం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరా పాటు జగనన్నే గుర్తుకు వస్తారని రాజా వివరించారు. రాష్ట్రంలో మహిళలు అందరికీ సమాన భాగస్వామ్యం జగన్ కల్పిస్తున్నారని, చిత్తశుద్ది ఉంటే సాధించి చూపించొచ్చని జగన్ నిరూపించారు అన్నారు. దిశ చట్టాన్ని రూపొందించడమే గాకుండా దాని ఆమోదానికి కేంద్రప్రుత్వానికి పంపి ఊరుకోకుండా దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్నీ జగన్ ఏర్పాటు చేసారనీ ఆయన పేర్కొన్నారు.

 

ఏ దేశంలోనైనా మహిళలకు అన్నీ ఉన్నా ముఖ్యంగా శాంతి, భధ్రత ఉండాలని, ఇవి లేకుంటే బ్రతుకును ఈదలేమని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించే సమాజం ఎప్పుడూ వృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రధమ స్థానాన్ని ఇచ్చిన జగన్ వారి రక్షణకు దిశ చట్టాన్ని ప్రవేశ పెట్టారని, రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ చట్టం లోపాలను సవరించిందని, దీనిని ఆమోదానికి రాష్ట్ర మహిళా కమీషన్ కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని, దీని ఆమోదానికి పార్లమెంటులో తలలు పట్టుకుంటూ ఉన్నారని, దీనిపై మేధోమధనం జరుగుతోందనీ, ఇది ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉందని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఈ దిశ చట్టం ఆమోదం పొందుతుందని ఆమె తన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసారు. తల్లి, తండ్రులు పిల్లలతో స్నేహ పూర్వకంగా ఉండాలని, అరమరికలు లేకుండా ప్రతీ విషయాన్ని పరస్పరం పంచుకుంటూ ఒకరికొకరు సహకారిగా ఉంటూ ప్రమాదాలను నివారించుకోవాలని హితవు చెబుతూ ముఖయమంత్రి జగన్ కు మహిళల ఆదరణ, ఆశీస్సులూ ఎప్పుడూ ఉండాలని ఆమె కోరారు.

 

ప్రభుత్వం కాపాడుతున్నప్పటికీ, చట్టం రక్షిస్తున్నప్పటికీ సమాజంలో మహిళలు ఏదో రూపంలో విపత్కర పరిస్థితులకు, అనుకోని ప్రమాదాలకు, ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో నిమిషాల వ్యవధిలోనే పోలీసుల రక్షణ, సహాయం పొందడానికి దిశ అనువర్తనం ఉపయోగపడుతుందని మరో అతిధి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఒంటరి ప్రయాణాల్లో మహిళలకే గాక పురుషులకు కూడా మన పక్కనే పోలీసులు, పోలీస్ స్టేషన్ ఉన్నట్టు దిశ రక్షణగా ఉంటుదని ఆయన పేర్కొన్నారు. మీ రక్షణ, భద్రత కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపొందించిన దిశ అనువర్తనం వినియోగంపై అపోహలను తొలగించు కోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ పిలుపు నిచ్చారు.

 

సమాజంలో ఇంకా మార్పు రావాలని, పరుషులు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని, అప్పడు మహిళలకు ఇబ్బందులు తగ్గుతాయని జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం మహిళలపై జరిగే నేరాల విచారణ, రక్షణ కోసం మొత్తం 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి, మహిళా సిబ్బందిని నియమించామని ఆమె తెలిపారు. అంతే గాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సాధారాణ పోలీస్ స్టేషన్లలోనూ మహిళల అవసరం కోసం మహిళా సహాయక కేంద్రాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసామన్నారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగుకు ద్విచక్ర వాహనాలను, దిశ కేసులో తక్షణం రక్షణ ఇవ్వాలి కాబట్టి ప్రత్యేక వాహనాలను కేటాయించా మన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఐదారు ప్రభుత్వ శాఖలు కలసి సమన్వయంతో దిశ పోలీస్టేషన్లలో పని చేస్తున్నారని, ఆపదలో ఉన్న మహిళలకు పోలీస్ స్టేషన్లలో, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వన్ స్టాప్ కేంద్రాల్లో తక్షణ సహాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వన్ స్టాప్ కేంద్రాలు సరిగా పని చేయడం లేదని, మన రాష్ట్రంలో మహిళల సమస్యలు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ఇంత బాగా పని చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా ఫోక్సో చట్టం ద్వారా సేవలందు తున్నాయని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహ మిస్తోందని, వారి సంక్షేమం కోసం అనేక పధకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, మహిళల చేతికి డబ్బు ఇస్తే మొత్తం కుటుంబానికి మేలు జరుగు తుందనే పధకాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ కృతికాశుక్లా వివిరించారు. కలెక్టర్ అనంతరం మాట్లాడిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు దాదాపుగా కలెక్టర్ చెప్పిన విషయాలనే ప్రస్తావించారు. అతిధులుగా కాకినాడ జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీ పి.శ్రీనివాస్, పెద్దాపురం ఎస్డీపీఓ అదనపు ఎస్పీ. అరిటాకుల శ్రీనివాసరావు, కాకినాడ దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ సుంకర మురళీ మోహన్, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. 10.43 గంటలకు సంగీత నృత్య విద్యా సంస్థ బాలికా చిన్నారుల “స్వాగతం… స్వాగతం… గాన నృత్యంతో సభకు ఆహ్వనం పలుకగా కత్తిపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినుల వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమై, జాతీయ గీతాలాపన లేకుండా ముగిసిన ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు సీఐ కే.కిషోర్ బాబు, శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు, వైస్ ఎంపీపీ దారా వెంకటరణ, శంఖవరం మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, మండల పరిషత్తు అభివృద్ధి అధికారి జాగారపు రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులూ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement