విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కరప మండలం విశ్వం వాయిస్ న్యూస్:
అబరాలు వేసుకుని రైతులు లాభం పొందాలని ఏడిఏ పద్మశ్రీ రైతులకు సూచించారు. మండల కేంద్రమైన కరప గ్రామంలో శనివారం చంద్రన్న సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారి గాయత్రి దేవి, ఇరిగేషన్ శాఖ అధికారి కె కీర్తి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ డి ఏ పద్మశ్రీ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జూన్ ఒకటో తేదీ నుండి నీటిని విడుదల చేస్తామని, కాబట్టి ముందస్తుగా రైతాంగాన్ని ప్రధానంగా మూడు పంటలు జూన్ ఒకటో తేదీ నుండి నీటిని విడుదల చేయడం వల్ల ఖరీఫ్ సీజన్ కి ప్రారంభంకాగానే నీటి విడుదల అంశంపై ఈ సీజన్లో మూడు పంటలు తీసుకునే విధంగా రైతులు లాభదాయకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. వేసవిలో అబరాలు వేసుకుని రైతులకి లాభదాయకంగా ఉంటుందని ఆమె సూచించారు. మొదటి పంట ముందస్తుగా వేసుకో గలిగితే నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే సైక్లోన్ బారినుండి రైతులకు తట్టుకోగలిగి పంట నష్టం అనేది లేకుండా రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఉద్దేశంతో జూన్ ఒకటో తేదీ నుండి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, కాబట్టి ఈనెల 23 తేదీ నుండి మండలంలో ఉన్న అన్ని వైయస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సమావేశాలు నిర్వహిస్తారని దీనిని ప్రతి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా సిబ్బంది, రైతులు, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.