చెట్టు విరిగి విద్యుత్ సరఫరా వైర్లపై పడటంతో విద్యుత్
సరఫరా నిలిపివేత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:_
. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో మంగళవారం నాడు వీచిన ఈదురు గాలులకు జోరువాన కు కొబ్బరి చెట్టు విరిగి విద్యుత్ సరఫరా రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకటిలో రైతులు పండించిన పంట ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు ఒక పక్క చీకటి మరో పక్క జోరు వానను కూడా లెక్క చేయకుండా చీకటిలో ధాన్యం రాశులు కాపాడుకునే ప్రయత్నం చేశారు విద్యుత్ సరఫరా అధికారులు మాత్రం నిమ్మకు నీరు పెట్టినట్టు ఎల్ ఐ బాలసుబ్రహ్మణ్యం ఉదయాన్నే చెయ్యరు లో విరిగిపడిన కొబ్బరి చెట్టును స్థానికుల సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు మిగిలిన మండలాల్లో విద్యుత్ సరఫరా ఉండగా ఒక్క కాట్రేనికోన మండలం లో నే ఎందుకు విద్యుత్ సరఫరా ఉండటం లేదో అర్థం కావట్లేదని చెయ్యరు గ్రామస్తులు వాపోతున్నారు