Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పంచాయతీ ముందు మృతదేహం””ఖనానికి జాగా లేదుగా””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– అంత్యక్రియలకు స్థలం చూపించాలంతు రెండు
రోజులుగా పడిగాపులు
– అర్తమూరులో దళితులకు స్మశాన వాటిక ఉందా..
ఉంటే ఎక్కడా ?
– కొలిక్కిరాని చర్చలు.. దళితులపై వివక్షత
కొనసాగుతూనే ఉంటుందా?
– స్థానిక అధికారుల తీరుపై విమర్శలు
– అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు
– జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని
దళితుల వెళ్ళండి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

మండపేట, విశ్వం వాయిస్ః

అర్తమూరులో దళితుల శ్మశాన వాటిక అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గ్రామానికి చెందిన ఓ దళిత వృద్ధుడు మృతి చెందితే ఖననం చేసేందుకు జాగా లేకపోవడం పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారంతో రెండో రోజు అయన అర్తమూరు పంచాయితీ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద వృద్ధుడి శవాన్ని ఉంచి అంత్య క్రియలకు స్థలం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులపై మండల స్థాయి అధికారులు వివక్షత చూపిస్తున్నారంటూ దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర వర్ణాలకు పంచాయితీ, రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తూ ఎస్సీలను హేళన చేస్తున్నారని వాపోతున్నారు. మరో వైపు తహసీల్దార్ తంగెళ్ళ రాజ రాజేశ్వరరావు, ఎంపీడీవో ఐదం రాజు, పంచాయితీ కార్యదర్శి కొండలరావు, రూరల్, ఆలమూరు ఎస్సైలు బల్లా శివకృష్ణ, సోమన శివ ప్రసాద్ లు పలు దఫాలుగా చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. హై కోర్టులో వివాదమున్న స్థలంలో కాకుండా మూడు వేరు వేరు చోట్ల ఖననానికి స్థలం చూపించినా, ఆందోళన కారులు అక్కడ ఖననం చేసేందుకు ఒప్పుకోవడం లేదని తహసీల్దార్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. అధికారులు చూపిన స్థలాల్లో క్రైస్తవ ఆచారం ప్రకారం సమాధులు నిర్మిస్తే కేవలం ఐ..దారు సమాధులు మాత్రమే సరిపోతాయని శాశ్వత పరిష్కారం ఉండదని దళిత నాయకలు గుమ్మడి అనిల్ కుమార్ పేర్కొన్నారు. పంచాయితీకి చెందిన చెరువు గట్టు వద్ద నిర్వహించాలని అధికారులు చెబుతుండగా అక్కడి రైతులు సంబంధిత పంచాయితీ, ఈ స్థలాన్ని శ్మశాన వాటికగా కేటాయిస్తూ ధృవీకరణ ఉత్తరువులను తీసుకురావాలని రైతులు చెబుతున్నట్లు దళిత నాయకులు పేర్కొన్నారు. చెరువు గట్టు స్థలాలను రాత పూర్వకంగా ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు తెగేసి చెప్పారు. ఇది ఇలా ఉండగా ఆర్డీవో, డీఎస్పీ స్థాయి అధికారులు అమలాపురం అంశంలో ఉండగా ఇక్కడ పరిస్థితి ఎక్కడిది అక్కడే అన్న చందాన ఉంది. జిల్లా కలెక్టర్ కల్పించుకొని దళితులకు న్యాయం చేయాలని రెండు రోజులుగా ఖననానికి నోచుకోని దళిత వృద్ధుడి మృత దేహానికి మోక్షం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. కుల వివక్షత హక్కులను కాలరాయడం ఖననాన్ని అడ్డుకోవడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement