విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:
చింతూరు విశ్వం వాయిస్ న్యూస్ 31-5-2022
మండలంలోని కుమ్మురు సచివాలయం వద్ద మంగళవారం సిపిఎం ,టిడిపి ఆధ్వర్యంలో త్రాగు నీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, ఉపాధి హామీ డబ్బులు తదితర సమస్యలపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిసం సురేష్ మాట్లాడుతూ కుమ్మరు గ్రామపంచాయతీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వేసవి తాపానికి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నరని అన్నారు. చేతి పంపుల్లో నీరు రాక పలు చేతిపంపులు మరమ్మతులకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంచినీటి పథకాలు మంజూరయ్యాయని చెప్పిన అధికారులు నేటికీ వాటి ఊసే ఎత్తలేదు అన్నారు. ప్రతి ఇంటికి తాగు నీటి కొళాయి ఇస్తామని చెప్పిన పాలక ప్రభుత్వాలు మాట తప్పింది అన్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా పడలేదని, గత ఏడాది సంభవించిన వరదలకు ముంపుకు గురైన బాధితులకు ఇస్తామన్న రెండు వేల రూపాయలు కూడా నేటికి అందజేయ లేదన్నారు. స్వచ్ఛభారత్ పేరుతో ప్రారంభించిన మరుగుదొడ్లు అరకొర నిర్మాణాలతో అవినీతి కంపు కొడుతున్నాయ్ అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లు పూర్తిగా పాడైపోయి వీధులు అద్వాన్నంగా మారాయన్నారు. వీధి లైట్లు వేసే దాంట్లో కూడా సచివాలయ సిబ్బంది, అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం టిడిపి మండల అధ్యక్షులు ఇలా చిన్నా రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం కేవలం బటన్ నొక్కి పైసలు వేస్తున్నామని మాటల గారడి చేస్తోందని, గిరిజన మండలాల్లో ఆదివాసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఐటీడీఏ కార్యాలయం ఆర్డీవో కార్యాలయాన్ని ఎటపాక డివిజన్ కేంద్రాన్ని ఈ ప్రభుత్వం ఎత్తివేసి ఆదివాసీలకు పరిపాలనా సౌలభ్యం లేకుండా చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు సమస్యలపై దృష్టి సారించకపోవడం ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని వీఆర్వో లక్ష్మణ్. వాటర్ స్కీమ్ ఇంజనీర్ పి వెంకట రాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంజా సీతారామయ్య, మాజీ జెడ్పిటిసి టు రంగమ్మ, ఎం పి టి సి వేక రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సవలం నారాయణ తదితరులు పాల్గొన్నారు.