విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్)
వె దురుమూడి గ్రామంలో ఈ రోజు మంగళవారం తెల్లవారు ఝామున అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీ ఢీకొని ఒక పేంకేటిల్లు ధ్వంసం అయింది. దాని ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభం పడిపోవడం తో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. ఆ ఇంటిలో ఎవరూ నివాసం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అంగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోమట్టి అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.