Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,455,533
Total recovered
Updated on June 2, 2023 7:55 PM

ACTIVE

India
3,736
Total active cases
Updated on June 2, 2023 7:55 PM

DEATHS

India
531,874
Total deaths
Updated on June 2, 2023 7:55 PM

పాలకులు చేయాల్సింది..?””పాత్రికేయులు చేస్తున్నారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కలెక్టరేట్లో మజ్జిగ..
మంచినీళ్లు సదుపాయం
– పాత్రికేయులు సేవలు ప్రశంసనీయం.. అధికారులు,
ప్రజలు
– దాతలకు కృతజ్ఞతలు.. పాత్రికేయులు
– పాత్రికేయులను గుర్తించని ప్రభుత్వాలు.. సంక్షేమ
అభివృద్ధి శూన్యం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్:

పాలకులు చేయాల్సిన ప్రజా సేవ పాత్రికేయులు చేస్తున్నారంటూ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. జిల్లా నలుమూలల నుండి సమస్యలు పరిష్కారం కోరుతూ వచ్చే ప్రజలు ఎండనక వాననక కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు. సమస్యలపై వచ్చే ప్రజలకు వేసవికాలంలో దాహార్తిని తీర్చేందుకు కలెక్టర్ కార్యాలయంలో మజ్జిగ, మంచినీళ్లు సదుపాయం గతంలో ఏర్పాటు చేసేవారు . అటువంటిది కరోనా పుణ్యమా అంటూ సుమారు మూడేళ్ల గా మజ్జిగ గాని మంచినీళ్లు గాని పెట్టడమే మానివేశారు. అలాగని ప్రజా సమస్యలపై ప్రజలు రావడం మానలేదు. ఇది గమనించిన స్థానిక పాత్రికేయులు గత రెండు సంవత్సరాలుగా వేసవికాలంలో మజ్జిగ, మంచినీళ్లు సదుపాయం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని ఎలాగైనా తీర్చాలి అనే సదుద్దేశంతో తల కొంచెం డబ్బులు వేసుకుని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇది చూసిన కొంత మంది దాతలు ముందుకు వచ్చి ఒకరోజు మేం పెడతామంటే …ఒకరోజు మేం పెడతామంటూ తమ సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే పాత్రికేయుల పరిస్థితి దుర్భరంగా తయారయ్యింది. జీతాలు లేవు.. పేపర్లు నడపలేని దుస్థితి దాపురించింది… జీతాలు లేకపోగా యాజమాన్యాలకు తిరిగి కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. విలేకరులను కనీసం సామాన్యులు గాను, ఒక ఓటరుగా కూడా గుర్తించని ప్రభుత్వాలు. వాస్తవంగా చెప్పాలంటే పాత్రికేయులు అధికార పక్షం, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు ఉంపుడుగత్తె గా పనిచేస్తూ నిత్యం ప్రజా అవసరాల మేరకు కథనాలు, సమాజంలో మార్పుకు తమ వంతు కృషి … తపనతో ఎవరు గుర్తించకపోయినా అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతూ జీవనం సాగిస్తున్నారు. అందరితోనూ కలివిడిగా ఉండటం, చిరునవ్వుతో పలకరించడం జరుగుతుంది. కానీ వెనుక బాధలు, కన్నీటి వ్యధ ఎవరు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. యాజమాన్యాలు నుండి రూపాయి సంపాదన లేదు… అలాగని ప్రభుత్వ కార్యాలయాల నుంచి యాడ్స్ తగ్గిపోయాయి. అడిగితే అధికార పార్టీకి చెందిన పేపర్, ఛానల్ కు తప్ప మిగతా పేపర్లు, చానల్స్ కు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. అధికార పార్టీలో ఉన్నవారు చేస్తారా అంటే అందలమెక్కిన తర్వాత పాత్రికేయులను చీడపురుగుల చూస్తున్నారు. అధికార హంతో అవినీతి చేసుకుంటూ పోతున్న ప్రశ్నించకూడదు… వార్తలు రాయకూడదు… పైగా బెదిరింపులు.. ఎట్లా బ్రతకాలో కాస్త చెప్పండి సారు సమాధానం చెప్పేవారే లేరు… ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి లో ఉన్నప్పటికీ తమ వంతు బాధ్యతగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించి అందరికీ ఆదర్శవంతంగా కాకినాడ పాత్రికేయులు నిలిచారు. ఏప్రిల్ నెలలో మొదలైన మజ్జిగ పంపిణీ సుమారు నెల రోజులుగా రోజుకొకరు చొప్పున, దాతల సహాయంతో దిగ్విజయంగా జరుగుతూ వస్తుంది. అయితే ఈ సంవత్సరం తతంగమంతా నడిపేది కాకినాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మంగా వెంకటరామకృష్ణ, ఇతర పాత్రికేయులు. వీరు చేస్తున్న సేవలకు జిల్లాలో ఉన్న అధికారులు, ప్రజలు నుంచి ప్రశంసలు వెలువడుతున్నాయి. పాత్రికేయులు అంటే వార్తాకథనాలు మాత్రమే కాదు సేవాభావం కలిగి ఉండాలని స్థానిక పాత్రికేయులు నిరూపించారు. నలుగురికి ఆదర్శంగా నిలిచారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!