విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ద్రాక్షారామం:
రామచంద్రపురం (విశ్వం వాయిస్ న్యూస్ )
ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వర దంత వైద్యశాల డాక్టర్ బి. క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించారు. పొగ త్రాగడం వలన వచ్చే సమస్యలను పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి అరుణ, ఉప సర్పంచ్ పెన్నాడ బుచిరాజు, బీ సీ. నాయుకుడు యాట్ల నాగేశ్వరరావు, గంపల సోమరాజు, రమణ, గ్రామ వాలెంటీర్లు పాల్గొన్నారు.