విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట అర్బన్ (విశ్వం వాయిస్ )
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు తో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 175 నియోజకవర్గాలలో ప్రతిష్టాత్మంగా జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మండపేట పట్టణంలో విశేష స్పందన లభించింది. మండపేట నియోజక వర్గ ఇంఛార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పట్టణంలో 7,8, వార్డులలో ఆయా వార్డు ఇంచార్జి,కౌన్సిల ర్ మందపల్లి రుద్ర కాంత్, మందపల్లి రవి కుమార్, వార్డు వాలెంటీర్లు వెంటరాగా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పై ఆరా తీశారు. అర్హత వుండి ఏమయినా సాంకేతిక ఇబ్బందులు వలన సామాజిక ఫించన్లు, వైఎస్ఆర్ చేయూత వంటి సంక్షేమ ఫలాలు అందకపోయినా, వ్యక్తిగత అవసరాలు వున్న వున్న,వెంటనే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పందించి ప్రక్కనే వుంటున్న వార్డు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించమని అదేశాలు ఇస్తున్నారు. గడప గడపకు వెళుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు పూలమాలలు, శాలువాలు తో పుర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల ముంగిట పాలన అందిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ తోట విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూకదుర్గా రాణి, వైసీపీ నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధ కృష్ణ, వైస్ చైర్మన్ పిల్లి గణేష్, కౌన్సిలర్ లుసీతా మహాలక్ష్మి, పోతంశెట్టి ప్రసాద్, మెండు భవాని, శెట్టి కల్యాణి, గ్రంధి శ్రీనివాస్, పిల్లి శ్రీని వాస్, వై.ప్రభావతి, కొవ్వాడ బేబీ, అమలదాసు లక్ష్మి, మెండు బాపిరాజు, కొప్పిరెడ్డి పద్మావతి, సూరంపూడి సత్య ప్రసాద్, లేగా వెంకన్న, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వర రావు, టీ. ఉషారాణి రాజేష్, దేవు నాయుడు, పేంకే గంగాధర, గొలుగురి సందీప్ రెడ్డి, ముక్క బ్రదర్స్,ఉంద్రజవరం అర్జున్, గురజాల శ్రీనివాస్, సాధనాల శివ భగవాన్,అడబాల వీరబాబు, తులా శేషారావు, ద్వారపూడి సర్పంచ్ ఈతకోట కిన్నెర, రెడ్డి రత్తయ్య, మీసాల రమణ, చందన వెంకటేష్,
ఎంపీపీ ఉండమట్ల శ్రీను వాసు, జెడ్పీటీసీ కుడుపూ డి భవానీ రాంబాబు, పట్టన కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, సూరంపూడి సత్య ప్రసాద్, బీ. సి. కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్,పలివెలసుధాకర్, మడికి ఆనంద రావు, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, చుండ్రు సత్తి బాబు, అయినవిల్లి రమణ, బీ. మోషా, జిన్నురి సాయిబాబు, మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందు రాజు, కపిలేశ్వరపురం మండలం వైసీపీ నాయకులు మేడిశెట్టి దుర్గా రావు, కేదా ర్లంక ఎంపీటీసీ యర్రంశెట్టి నాగేశ్వర రావు, నక్క సింహాచలం,సలాది వీర బాబు, నేలటూరు వైస్ ప్రెసిడెంట్ శనక్కయాల దొరబాబు, వంగా నల్ల శ్రీను, ప్రగడ అర్జునరావు, పాలంగి కిషోర్, ఖండేశ్వర రావు, తోటకూర రాజు, సూరి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్,అధికారులు, నాయుకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.