విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కరప ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ జిల్లా: మనిషి జీవితం సంపాదిస్తూ బ్రతకలనేదే ప్రతి ఒక్కరది ప్రయాణం కానీ వక బిచ్చగాడు జీవితం తాను బిక్షమేత్తి సంపాదించిన ధనంతో సుఖపడలేదు హఠాన్మరణంతో తాను సంపాదించిన సొమ్ములు, వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామం మార్కెట్ సెంటర్ వద్ద ఆరు సంవత్సరాల క్రితం కడప జిల్లా నుండి వచ్చిన ఒక యాచికుడు (75) గురువారం అనారోగ్యంతో నో గుండెపోటుతో నో హఠాత్తుగా మరణించాడు అక్కడ ఉండే స్థానికులు పోలీసులకు ఫోన్ చేయ్యాగా పోలీసులు వీఆర్వోల సమక్షంలో కేసు నమోదు చేశారు, అనంతరం అక్కడ ఉండే స్థానికులు అతని మృతదేహాన్ని ఖననం చేశారు, అతని ఇంట్లో ఉన్న నగదు సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసినదే, శుక్రవారం కరప మండలం కరప గ్రామం చంద్రన్న కమిటీ హాల్ నందు సీల్ చేసిన నగదును తెరిచారు మొత్తం నగదు పది నోట్లు చిల్లర నాణాలు ఎక్కువ ఉండటంతో మహిళా పోలీస్ సిబ్బందితో వాటిని లెక్కించారు, రూ. 3.39.500/- వచ్చాయి ఈ నగదును అధికారుల సమక్షంలో గవర్నమెంట్ కి హ్యాండ్వర్ చేస్తామని అన్నారు,
ఈ కార్యక్రమంలో ఎస్ఐ డి రమేష్ బాబు, ఏఎస్ఐసూరిబాబు, ఈఓపిఆర్డి గొలగోటి త్రినాథ్, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, సర్పంచ్ సాదే ఆశాజ్యోతి కుమార్, తదితరులు పాల్గొన్నారు…