– ఆదాల శివాజీ, అనిల్.. మెమోరియల్ క్రికెట్
టోర్నీ ప్రారంభం
– రిబ్బన్ కట్ చేసి క్రికెట్ పోటీలు ప్రారంభించిన
– జెడ్పిటిసి రంగారెడ్డి వైకాపా నాయకులు ఒడియన్
గోపాల్, ఎంపిటిసి వాళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
విఆర్ పురం (విశ్వం వాయిస్ న్యూస్) 08;-
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని దోహద పడతాయని , మండల జడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి అన్నారు. జీడిగుప్ప గ్రామంలో కీర్తి శ్రేష్ఠులు మాదాల శివాజీ, పండా అఖిల్ జ్ఞాపకార్దం జీడిగుప్ప క్రీడా మైదానంలో బుధవారం నాలుగు పంచాయతీ లు కు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో జీడిగుప్ప తుమ్మిలేరు కొయిదా గ్రామపంచాయతీ స్తాయి క్రికెట్ టోర్నమెంట్ ను జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి, వైకాపా మండల కన్వీనర్ పోడియం గోపాల్, జీడిగుప్ప ఎంపిటిసి వాళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి కొబ్బరి కాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి పోటీలు లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి ఎంపిటిసి వాళ్ళ వెంకటేశ్వరరెడ్ది వైకాపా మండల కన్వీనర్ పోడియం గోపాల్ మాట్లాడుతూ యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా సన్మార్గం లో వెళ్లాలని అన్నారు.క్రీడలు ఆడడంద్వారా శరీర దారుడ్యం తో పాటు మానసిక ఉల్లాసాలాన్నీ కలిగిస్తాయని సూచించారు.ఈ కార్యక్రమంలో జీడిగుప్ప సర్పంచ్ మూట్ల బాలరాజు ఉపసర్పంచ్ కుంజా రమేశ్ జీడీగుప్ప రాయి గూడెం గ్రామస్తులు కదల కొండయ్య రెడ్డి రామకృష్ణ నూపాశంకర్ అయినవోలు మోహన్ రావు క్రీడాకారులు పుర ప్రముఖులు పాల్గొన్నారు.