శైలజనాథ్
* ఆంధ్ర రత్న భవన్ లో ఆచార్య ఎన్. జి.రంగా వర్ధంతి సందర్భంగా నివాళులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
విశ్వం వాయిస్ న్యూస్
విజయవాడ : ఆచార్య ఎన్.జి.రంగా ప్రసిద్ధుడైన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ వాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ఎన్.జి.రంగా వర్ధంతిని పురస్కరించుకుని శైలజనాథ్ ఆయనకు నివాళులు అర్పించారు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన రంగాను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారని చెప్పారు. 1991 లో భారత పద్మ విభూషణ్ పురస్కారం పొందారని, 1930-1991 వరకు సుదీర్ఘ కాలం భారత పార్లమెంట్ సభ్యునిగా పనిచేసారని శైలజనాథ్ పేర్కొన్నారు.
1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి రంగా తన ఉద్యోగాన్ని వదిలి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారని, 1931 డిశంబరులో వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో రంగా ఒక సంవత్సరకాలం జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పొరాటంలో భాగం చేసారని, 1933 లో నిడుబ్రోలులో రామనీడు పేరుతో వయోజన రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారని, ఈ రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారని, ఈ పాఠశాల గత స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుందన్నారు. తన భార్య భారతీ దేవి తో కలసి వ్యక్తి గత సత్యాగ్రహంలో పాల్గొన్నారని, 1940లో మద్రాసులో శాసనోల్లఘనజేసి చెరసాలలో ఏడాది ఉన్నారని తెలిపారు. 1941 జైలునుండి విడుదల చేసి వెనువెంటనే డెటిన్యూగా రాయవేలూరు జైలుకు తీసుకొని వెళ్ళి 1942 విడుదల చేశారని, మరల క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942 నవంబరు 4 న నిర్బంధించి రాజపుట్లనా దగ్గర దామో జైల్లో ఉంచి 1944 అక్తోబరు 9 తేదీన విడుదల చేశారని,ఈ సమయంలో ఆయన ఆనేక గ్రంథాలు రాశారని, స్వాతంత్ర్య పొరాటంలో రంగా ఆరు సార్లు కారాగారంలో ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్, రాజాజీ, రాజేంద్ర ప్రసాదు, యం.యం.జోషి, జయప్రకాశ్ నారాయణ్, రాధాకృష్ణ, వి,వి,గిరి, ప్రకాశం పంతులు వంటి వారి సహచర్యంతో విశేషంగా కృషి చేసారని శైలజనాధ్ అన్నారు.