విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ప్రత్తిపాడు:
విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద శంకర్ల పూడి గ్రామంలో మళ్లీ పులిజాడలు కనిపించడంతో అధికారులు పరుగులు తీశారు.పులి పెద శంకర్ల పూడి గ్రామం నుండి అటవీ ప్రాంతానికి వెళ్లిపోయిందని గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్న తరుణంలో పులి వెనక్కి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పులి దానంతట అది వెళ్లిపోవాలా.. లేక పులిని పట్టుకుంటారా అధికారులు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.
గత పదిహేను రోజులు దాటినప్పటికీ ప్రత్తిపాడు మండలంలో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పులి ఎప్పుడు వస్తుందో… ఎక్కడకి వస్తుందో… ఏమి చేస్తుందో అనే భయంతో ప్రజలు రాత్రి పగలు తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా జీవనం సాగిస్తున్నారు.గత 15 రోజుల దాటినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.గత పదిహేను రోజుల నుండి రైతులు పంట పొలాల్లోకి వెళ్ళకుండా ఎక్కడికక్కడ రైతులు ఇంటివద్దే ఉండిపోవడంతో పంట నష్ట పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రోజువారి కూలీలు కూడా పనిలోకి వెళ్లకుండా ఇంటివద్దనే ఉండిపోవడంతో ప్రజల జీవనాధారం కోల్పోయారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.