కాట్రేనికోన మండలం పరిధిలో పలం గ్రామానికి చెందిన
వాలేపు కాసుబాబు అనే యువకుడు బీర్ బాటిల్ తో తలపై బలంగా కొట్టి కంఠంలో పొడవడంతో మరణించిన కాసుబాబు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:-
కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన పాలెపు కాసుబాబు కాకినాడలో ఫోటో స్టూడియో నడుపుతున్నాడు ఇతనికి పెళ్లి కూడా కుదిరింది మరో రెండు నెలల్లో పెళ్లి జరగబోతుంది పల్లం గ్రామానికి చెందిన మల్లాడి రవి కాసు ఇదే ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాడు వీరిద్దరితో పాటు మరికొంతమంది యువకులు కాకినాడలోని ఒక లాడ్జిలో బుధవారం రాత్రి మద్యం సేవించి ఘర్షణ పడ్డారని ఘర్షణ పడిన తర్వాత రవి కాసు లాడ్జి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అని మరలా గురువారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో లాడ్జ్ కి వచ్చి పాలెపు కాసుబాబు పై బీర్ బాటిల్ తో తలపై కొట్టడంతో పాటు పగిలిన బీర్ బాటిల్ తో కంఠంలో పొడవడంతో పాలెపు కాసుబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు హత్య చేసిన నిందితుడు మల్లాడి రవి కాసు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు మళ్లీ తిరిగి వచ్చి మల్లాడి రవి కాసు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది అసలు గొడవ ఎందుకు జరిగింది హత్య చేసే అంతటి బలమైన కారణాలు ఏమున్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు