విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి.గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్ )
పి.గన్నవరం మండలం లోని రాజుల పాలెం గ్రామ పంచాయతీ పరిధిలో అయినాలవారిపాలెం మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కొంబత్తులఏసుఅధ్యక్షతన నాగాబత్తులమహేష్ బాబు ( బ్లైండ్ విద్యార్థి) 10వ తరగతిలో 374 మార్పులతో మొదటి స్థానం సాధించాడంతో మహేష్ ను అభినందించి సన్మానించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలుఅంబటి భూలక్ష్మి కోటేశ్వరావు, మండల అభివృద్ధి అధికారి ఐ.ఇ.కుమార్, మండల విద్యాశాఖ అధికారి కోనా హెలీనా, రాజులపాలెం గ్రామ పంచాయితీ ఉపసర్పంచ్ శ్రీమతి నంబూరి విజయలక్ష్మి 3000 వేలు రూపాయలు బహుమతిగా ఇచ్చి మహేష్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కోన హెలీనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పించే వసతులు చదువును సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని తెలియజేశారు ఎంపీడీవో కుమార్ మాట్లాడుతూ చదువుకి అంగవైకల్యం అడ్డు రాదని పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని తెలియజేశారు, ఎంపీపీ అంబటి భూలక్ష్మి మాట్లాడుతు మహేష్ లాంటి విద్యార్థుల వల్ల గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని పట్టుదలతో చదవాలి అని తెలియజేశారు మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు కోరుకొండ జాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము పేదరికంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి దివ్యాంగుల విద్యార్థులపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అబ్బాస్ ఆలీ ఉపాధ్యాయులు కడలి సత్యనారాయణ, అంబటి మణికంఠ, పలువురు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు