విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడాన్ని రాయవరం మండలం బిజెపి నాయకులు, లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి కి రాంబాబు తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రమైన రాయవరం తాసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం మండల బిజెపి నాయకులు జానకి రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం పై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జానకి రాంబాబు మాట్లాడుతూ గోదావరి గర్జన సభను చూసి తట్టుకోలేక తమ నాయకులు అమలాపురం పర్యటనను అడ్డుకున్నారని పోలీసుల వైఖరి పై ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు లేని ఆంక్షలు మా నాయకుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పర్యటన అడ్డుకోవడానికి ఓ ప్రైవేటు లారీని ఆలమూరు బైపాస్ రోడ్డు వద్ద ఆయన వాహనాన్ని ముందుగా నిలిపి ఆయనను గంటల పైబడి నుండి రోడ్డుపైనే పోలీసులపై చర్యలను తీవ్రంగా ఖండించారు. మా పార్టీ వారు ప్రజల్లో తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని, ప్రజల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లను సృష్టించేది మీరే ఆంక్షలు పెట్టేది మీరే. పోలీసులు కూడా డా మంచి చెడు ఆలోచించుకోవాలని వైసిపి నాయకులు మాట వింటూ మానాయకుడిపై కేసులు పెట్టుకుని పోతే మీరు ఇబ్బంది పడతారని జానకి రాంబాబు హెచ్చరించారు. అనంతరం తాసిల్దార్ కె జే ప్రకాష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.