Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వేసవి వినోదం విద్యార్థులకు చాలా ఉపయోగం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్

వేసవి వినోదం విద్యార్థులకు చాలా ఉపయోగం అని జిల్లా విద్యాశాఖాధికారిణి డి.సుభద్ర అన్నారు.గురువారం నాడు విద్యాశాఖ మరియు వి బి వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యం యస్ యన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వేసవి వినోదం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా విద్యాశాఖాధికారిని డి.సుభద్ర పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె శిక్షణ పొందుతున్న విద్యార్థులను వారు నేర్చుకున్న అంశాలపై ప్రశ్నించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రిసోర్స్ పెర్సన్ లను అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించాలి అన్నారు.ఈ వేసవి వినోదంలో విద్యార్థులకు ఉపయోగ పడే అనేక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంద్రజాలికుడు వి విఎస్. రమణమూర్తి హాజరయి విద్యార్థులకు ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించి విద్యార్థులను ఆనందింపజేశారు.అదే విధంగా పిల్లల జ్నాపకశక్తి పెరగడానికి మెళుకువలు నేర్పారు.మనో వికాసంపై శిక్షణను ఇచ్చారు.

రేవతి ఫౌండేషన్ అధ్యక్షులు కె.శ్రీకృష్ణ సాయి సైన్స్ లోని వివిధ ప్రయోగాలు ప్రదర్శించారు. ఈ ప్రయోగాలు విద్యార్థుల చే చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్. ఎస్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు శ్రీహరిరావు నాయుడు,జి.శ్రీనివాస్, ఎమ్.వి ఎస్.రామకృష్ణ, వేసవి వినోదం నిర్వాహకులు కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement