Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** కాకినాడలో వ్యక్తి హత్య **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

విశ్వం వాయిస్ న్యూస్

కాకినాడ : ప్రశాంతంగా ఉండే కాకినాడ నగరంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా హత్యోదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా సర్పవరం,టూ టౌన్, ఒన్ టౌన్ పోలీసు స్టేషన్లు పరిధిలో వాకలపూడి,పాత బస్టాండ్,జగన్నాధపురం ప్రాంతాల్లో వరుస హత్యలు జరిగాయి. గురువారం తెల్లవారుఝామున స్థానిక మెయిన్ రోడ్డులో గల ఓ లాడ్జిలో యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కాకినాడ టూ టౌన్ పరిధిలోని ఎస్. ఆర్.గ్రాండ్ హోటల్ లో కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన మల్లాడి ధర్మారావు కుమారుడు రవికాసు(25) గురువారం తెల్లవారుఝామున హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన పాలేపు కాసుబాబు(26)అనే వ్యక్తి బీర్ బాటిల్ తో రవికాసు ను గొంతులో పొడవగా చనిపోయాడని పోలీసులు తెలిపారు. వీరు ఇరువురు వైస్సార్ బ్రిడ్జ్ సమీపంలో వినాయక కేఫ్ దగ్గర మదర్ థెరిసా ఆర్ట్స్ దగ్గర ఒక రూమ్ తీసుకుని కలిసి వుంటున్నారు.వీరు ఫోటో డిజైనింగ్ చేస్తూవుంటారు. బుధవారం ఉదయం11గంటల ప్రాంతంలో ఎస్.ఆర్.గ్రాండ్ లో రూమ్ తీసుకుని,మరో ముగ్గురితో కలిసి పార్టీ చేసుకున్నారు.ఇద్దరు పార్టీ అయిన తరువాత వెళ్లిపోయారు.అర్ధరాత్రి 3.30గంటల సమయంలో పెద్దగా అరుపులు వినిపించాయని తెలిపారు.పాత గొడవలు నేపథ్యంలో మద్యం మత్తులో ముందుగా పాలేపు కాసుబాబును మల్లాడి రవికాసు బీర్ బాటిల్ తో పొడిచాడని కాసుబాబు తిరగబడి రవికాసు ను గొంతులో బీర్ బాటిల్ తో పొడవగా చనిపోయాడని తెలిపారు. హత్య అనంతరం నిందితుడు కాసుబాబు పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు జిజిహెచ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement