విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి.ఆర్.పురం,(విశ్వం వాయిస్ న్యూస్) 16;-
రాష్ట్ర జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం రంపచోడవరం నియోజకవర్గం వి.ఆర్.పురం మండలం లో ఏర్పాటు చేసిన సభలో సభ్యత్వం చేసుకున్న అందరికీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి కార్యకర్తల పై ఉన్న ప్రేమను గుర్తు చేశారు. ఈరోజు పార్టీ లో ఉన్నకార్యకర్తలే రేపు నాయకులుగా ఎదుగుతారని అన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో దించుతున్నారని , రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పుతారని, ఈ సారి ముఖ్యమంత్రి స్థానంలో జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఉంటారని, ఆయనని ముఖ్య మంత్రిగా చూడాలంటే జనసైనికులు నిరంతరం పార్టీ అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లనికోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
* ఆ బ్రిడ్జి నిర్మాణం మీ చేతకాని తనమే
జనసైనికులు మాట్లాడుతూ 25గ్రామాలలను మండల కేంద్రానికిని కలిపే చిన్న వంతెన కూలిపోయే మూడు సంవత్సరాలు పూర్తి అయ్యిందని ఇంతవరకు నిర్మాణం మొదలు పెట్టలేదని,ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పండి మేము చేసి చూపిస్తాం అని అన్నారు.
మండలంలోని నలబై సంవత్సారాల క్రితం అన్నవరం., ఉమ్మడి వరం మధ్య నిర్మించిన బ్రిడ్జి నేడు శిథిలావస్థకు వచ్చింది. వైసిపి ప్రభుత్వ యం యల్యే దృష్టికి స్థానిక రాజకీయ నాయకులు పలుమార్లు తీసుకెళ్ళేరు. కానీ నేటికీ ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. అందుకే మండల జనసేన పార్టీ నాయకులు వైసిపి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు బ్రిడ్జి నిర్మాణం చేపట్టుతారా లేక మా జనసేన పార్టీ చే నిర్మాణం చేయించాలా అని మండల అధ్యక్షలు ముత్యాల సాయికృష్ణ,అన్నారు. అన్నవరం బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన దుస్థితిని క్షుణ్ణంగా మండల జనసేన నాయకులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, ప్రధాన ఉపాధ్యాక్షులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి,నాగేంద్ర ప్రసాద్, పొషి రెడ్డి, బండారు రమేష్, ముంజపు సాయి, అల్లాడ శ్యామ్,బాగుల అంజనరావు, శ్రీరామ్,సి.వి.పి.ఆదిత్య,సాగర్,సాయి, సంతోష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.