విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్ ):
మండలం పరిధిలో జొన్నాడ గ్రామంలో వేంచేసియున్న గ్రామ దేవత భక్తుల కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీ శ్రీ శ్రీ సోమాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు, వైసిపి నాయకులు మేడపాటి శ్రీనివాస్ రెడ్డి (ఎమ్.ఎస్.ఆర్) దంపతులు, గ్రామ నాయకులు సోమలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రెండేళ్లు కరోనా ఆంక్షలతో నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా అమ్మవారి దర్శనభాగ్యాన్నికై పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుండి రద్దీ ఆరంభమైంది. భక్తులు కొబ్బరికాయలు కొట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు గావించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి