విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
అమలాపురం మండలం బండారులంక గ్రామం రైతు భరోసా కేంద్రం 1 వద్ద గ్రామ సర్పంచ్ పెనుమల సునీతఏడుకొండలు అధ్యక్షతన రైతులకు ఖర్రిఫ్ సీజన్ నిమ్మితం ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వచ్చిన వరి విత్తనాలును సర్పంచ్ పెనుమల సునీత చేతులు మీదుగా రైతులకు అందచేయటం జరిగినది.సర్పంచ్ మాట్లాడుతూ రైతులందురు త్వరగా నారు మడులు పూర్తి చేసి సకాలంలో పంట పండించి రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం కల్పించే మద్దతు ధరకు ధాన్యం అమ్మకాలు జరగాలని రైతులందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతు భరోసా సిబ్బంది పృథ్వి, నాగరాజు,గ్రామ రైతులు దంగేటి కృష్ణారెడ్డి,ఇళ్ల శ్రీనివాస్, దంగేటి సత్యనారాయణ, బట్టు ధర్వీకర్, గుత్తుల త్రిమూర్తులు, నాలం నాగేశ్వరుడు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు