విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
ఈశ్వరపురం విశ్వం వాయిస్ న్యూస్
దిశ ఏప్ పై కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక శ్రీనివాస రైస్ మిల్ వద్ద అంగర సబ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ ఆద్వర్యంలో పోలీస్ సిబ్బంది కపిలేశ్వరపురం మండపేట రహదారి పై తిరిగే వాహనాలు ఆపి ప్రయాణికులకు, వాహన చోదకులుకు దిశ ఏప్ పై అవగాహన కల్పించారు.అనంతరం వారి స్మార్ట్ ఫోన్లు లలో దిశ ఏప్ కల్పించారు.ముఖ్యంగా మహిళలకు దిశ ఏప్ ఆపత్కాలంలో రక్షణ కల్పించే వజ్రాయుధం వంటిదని ఎస్ ఐ సంపత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ దిశ ఏప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న ఆ పోలీస్ సిబ్బంది తో రక్షణ కల్పించబడుతుందని ఎస్ ఐ అన్నారు. ఆపద లో వున్న వ్యక్తి దిశ ఏప్ ప్రెస్ చేసిన వెంటనే ఆ వ్యక్తి వున్న లొకోషన్, ఆ సెల్ ఏప్ లో ఎడ్ చేసిన సెల్ నంబర్లకు త్వరితగతిన సమాచారం అందుతుందని ఎస్ ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సచివాలయం మహిళా పోలీస్ లు, ఏ. ఎస్. ఐ. రంగారావు లు పాల్గొన్నారు.