విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట పట్టణం విశ్వం వాయిస్ న్యూస్
23 వ, వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు అడుగు అడుగునా పులామాలలు తో అపూర్వ స్వాగతం పలికారు.లక్షల్లో అ0దుతున్న సంక్షేమ ఫలాలు వలన ప్రతి కుటుంబ0 సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా సంక్షోభంలోనూ మన ఆంద్ర ప్రదేశ్ లో ముందుగా ప్రకటించిన కేలండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. అటువంటి జగన్ మోహన్ రెడ్డి కి రాబోయే ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ తోట పుర ప్రజలు ను కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, వైసీపీ నాయకులు వేగుళ్ళ పట్టాభిరామయ్య, రెడ్డి రాధ కృష్ణ, ఎంపీపీ లు ఉం డమట్ల వాసు, మేడిసెట్టి సత్యవేని దుర్గా రావు, వైస్ చైర్మన్ లు పిల్లి గణేశ్వర రావు, వేగుళ్ళ నారాయణ రావు, కుడుపూడి రాంబాబు, కే దార్లంక సర్పంచ్ వీది వెంకట రెడ్డి బాబు, మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందు రాజు, అంగర వైస్ ప్రెసిడెంట్ యర్రా వీరన్న బాబు, కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాధి వీర బాబు, సుంకర మూలా స్వామి, పేరాబత్తుల రామ కృష్ణ, వంగా నల్ల శ్రీను, ప్రగడ అర్జునరావు, పుల్లేశ్వర రావు,సనక్కాయాల దొరబాబు,కౌన్సిలర్ లు, వార్డు వాలె0టీర్లు,అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.