విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామ పంచాయితీ పరిధిలో కొత్తగరువు కాలనీ కి చెందిన సవరపు మరియమ్మ ఎన్. ఆర్.జి.ఎస్ ఉపాధి హామీ పనుల్లో బాగంగా మంగళవారం వాసాల తిప్ప డ్రైనేజ్ పని చేస్తుండగా, సవరపు మరియమ్మ ని తేనెటీగలు తీవ్రంగా కుట్టడంతో వెంటనే అమలాపురం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆధునిక పరికరాలు లేకపోవడంతో ఏరియా హాస్పిటల్ డాక్టర్ లు సూచన మేరకు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.16వ తేదీ గురువారం దాయాలిస్ చేయగా తీవ్ర అవస్థకు గురై అర్ధరాత్రి మృతి చెందారని గ్రామ సర్పంచ్ నక్కా రాజా రత్న నాగ వాణి కృష్ణ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు