పదవి నుండి భర్తరఫ్ చెయ్యాలి కేసుని సిబిఐ కి
అప్పగించాలి అరకు పార్లమెంట్ తెలుగు యువత
అధికార ప్రతినిధి గడేసుల రంజిత్ కుమార్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:
చిత్తూరు- విశ్వం వాయిస్ న్యూస్
17/6/2022
నేనే హత్య చేసాను అని నేరం ఒప్పుకున్న హంతకుడు,కిరాతకుడు, వైసిపి పార్టీ సస్పెండ్ చేసిన MLC అనంత ఉదయ భాస్కర్ జైల్లో రిమాండ్ లో ఉన్న సమయంలో అధికార వైసిపి పార్టీ నాయకులు స్ధానిక ఎమ్మెల్యే ఆధ్యర్యంలో గడప గడపకు వైసిపి కార్యక్రమం చేస్తున్న సందర్భంగా హత్య చేసిన హంతకుడు నేర చరిత్ర ఉన్న MLC అనంత ఉదయ భాస్కర్ ఫ్లెక్సీ పెట్టీ దానికి పాలాభిషేకం చేయటం అంటే చాల దారుణం అన్యాయం ఇలా చేసి రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు,దళితులకు. వైసీపీ పార్టీ ఎం దిశ నిర్దేశం చేస్తున్నట్టు వైసిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ బదులు హత్యలు,అన్యాయాలు,అక్రమాలు,అరాచకాలు చేసే వారిని ప్రోత్సహిస్తూ వారితోనే పార్టీని నడిపించే పార్టీ అని రాష్ట్ర ప్రజలు అందరికీ సంకేతం పంపిస్తున్నారు
దళిత హంతకుడికి, వైసిపి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తికి, నేరస్తుడికి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పాలాభిషేకం ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైసిపి నేత జగన్ దీనికి సమాధానం చెప్పాలని రంజిత్ కుమార్ ఆయన ప్రశ్నించారు. హంతకుడికి జైలులో రాచమర్యాదలు చేయడమేమిటని, భాదిత కుటుంబ సభ్యులు ST SC అట్రాసిటీ కోర్టుకి వచ్చినప్పుడు MLC మనుషులు రంపచోడవరం ఎమ్మెల్యే వాహనం లో వచ్చి ఫోటోలు తీసుకోవటం ఏంటని, జైలులో హంతకుడికి ప్రత్యేక గది, ప్రత్యేక బెడ్, ప్రత్యేక ఫుడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలపై జైలులో జరుగుతున్న తంతు పై జైల్ సిసి టీవీ ఫుటేజ్ బయటపెట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్య హత్యకేసును సిబిఐకి అప్పగించాలని, అనంత ఉదయ భాస్కర్ ను ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక వైఖరిని మానుకోవాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా ఈ కేసు విషయంలో సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు ప్రజలకు ఉన్న సందేహాలను ప్రభుత్వం పోలీస్ అధికారులు నివృత్తి చెయ్యాల్సి ఉంది కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు చెప్పిన స్టోరీకి పోస్ట్ మార్టం నివేదికకు అసలు పొంతన లేదు 34 గాయాలు అయ్యాయని పోస్టుమార్టం నివేదిక చెప్తుంటే ఎస్పీ గారు సుబ్రమణ్యం ను MLC నేడితే వెళ్ళి ఇనుప వస్తువుకు తగలడం వలన చనిపోయాడు ఇది అనుకోకుండా జరిగింది అని చెప్పడం హంతకుడిని పోలీస్ లు కాపాడే ప్రయత్నం చెయ్యడమే కాదా అసలు హత్య జరిగిన రోజూ రాత్రి MLC అపార్ట్మెంట్ దగ్గర MLC తో పాటు ఉన్న మహిళా ఎవరు సుబ్రమణ్యం బాడీని తీసుకు వచ్చిన కార్ ఎవరిది దానిపై ఉన్న వేలిముద్రలు ఎవరేవరివి MLC ఒక్కడే సుబ్రమణ్యం ను చంపితే 34 గాయాలు ఎందుకు అవుతాయి ఈ హత్యలో ఎంత మంది ఉన్నారు వాళ్ళు ఎవరు అనే అన్ని అంశాలపై పోలీస్ డిపార్ట్మెంట్,ప్రభుత్వం వివరణ ఇచ్చి దోషులు అయిన వారిని కటినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం తో పాటు కుటుంభం నుండి ఒకరీకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలుగు దేశం పార్టీ గా డిమాండ్ చేస్తున్నామని రంజిత్ కుమార్ పేర్కొన్నారు