విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ : ఏ.పి పోలిసెట్ ఫలితాలలో ఆదిత్య గంగరాజునగర్ మరియు ఆదిత్య స్కూల్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అల్లూరి హృతిక్ సత్య నిహంత్ 119 మార్కులతో రాష్ట్ర 2 వ ర్యాంకును , టెంకాని సాయి భవ్యశ్రీ 118 మార్కులతో 3 వ ర్యాంకును , కె.వి.వి.శివమణి వినయ్ ఆదిత్య 118 మార్కులతో 3 వ ర్యాంకును , గొల్లపల్లి ఫణీంద్ర 118 మార్కులతో 7 వ ర్యాంకును , మల్లా జశ్వంత్ నారాయణ 118 మార్కులతో 7 వ ర్యాంకును సాధించారని ప్రిన్సిపాల్ జె.మొయినా తెలిపారు . 10 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు ఉచిత విద్యను అందిస్తూ వీరికి నగదు బహుమతి కూడా ఇస్తున్నామని ఆదిత్య సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి ప్రకటించారు . 10 లోపు 5 ర్యాంకులు , 100 లోపు 20 ర్యాంకులు , 1000 లోపు 73 ర్యాంకులు , ఆదిత్య విద్యార్థులు సాధించారని డైరెక్టర్ సుగుణారెడ్డి తెలిపారు . ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను , వారి తల్లిదండ్రులు విజయానికి కారకులైన ఉపాధ్యాయులను ఆదిత్య సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి మరియు ఆదిత్య స్కూల్స్ ప్రిన్సిపాల్స్ అభినందించారు .