– రాజుపేట గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి.ఆర్.పురం,(శ్వం వాయిస్ న్యూస్) 17;-
రాజుపేట గ్రామాన్ని పోలవరం ముంపు జాబితాలో చేర్చి ప్రభుత్వం రాజుపేట గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని సి.పి.యం. రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన.కిరణ్,పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూనెం.సత్యనారాయణ డిమాండ్ చేశారు.శనివారం నాడు రాజుపేట గ్రామంలో జనం కోసం సీపీఎం.. ఇంటింటికీ.. సీపీఎం.. కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాజుపేట గ్రామం పోలవరం ముంపు లో ఉన్నప్పటికీ ఈగ్రామని ముంపు జాబితాలోకి చేర్చకపోవడం బాధాకరమని వారు అన్నారు. అంతే కాకుండా గ్రామంలో ఇంట్రనల్ రోడ్స్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో పంకు.సత్తిబాబు,గుటలా. శ్రీను,తొడం. రాజు,కారం.సుందరయ్య,గుండిపూడి. లక్ష్మణ్ రావు,కమ్మచిచ్చు.సత్తిబాబు,దారయ్య, తదితరులు పాల్గొన్నారు..