విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా నిత్యం పాటు పడే వ్యక్తి కర్రి పాపారాయుడు అని మండపేట మండలం ఏడిద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలివెల సుధాకర్ పేర్కొన్నారు. పాపారాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట లో సుధాకర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత మయూరి వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జడ్పిటిసి సభ్యులు భవాని రాంబాబు, సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లూరి రామకృష్ణ లు కేక్ కట్ చేసి వృద్ధులకు పంపిణీ చేశారు. అలాగే వారికి పండ్లు, రొట్టెలు, స్వీట్ లు అందజేశారు. అదే విధంగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు,రొట్టెలు, రస్కులు పంపిణీ చేశారు. వీటితో పాటు అందులో పాఠశాలలో విద్యార్థులకు రొట్టెలు, బిస్కెట్లు, పండ్లు, స్వీట్ లు పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండపల్లి రాజేంద్రప్రసాద్, బేతా వెంకటేశ్వరరావు, వాసంశెట్టి శ్రీనివాస్, కొండేటి కాళీ కృష్ణ, పలివెల సుబ్బు, జుత్తుక గణేష్, అశోక్, జయ శేఖర్, సృజన్, యువరాజ్, కె.నవ్య తేజ, టీ పాపాచార్యులు, ఒంటెద్దు వెంకట లింగం, మేడిశెట్టిరాజు, ఉండ్రాసి రమేష్, పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.