వీరికి మద్దతు తెలియజేస్తూ తప్పుడు కేసులు పెట్టటం పై కండిస్తూ విరిపై అక్రమ కేసులు తీసివేయ్యాలి అని నిరసన తెలిపిన ఎమ్మెల్యే చిర్ల.
నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ లో నే నిద్ర చేసిన ఎమ్మెల్యే చిర్ల.
విషయం తెలుసుకుని రావులపాలెం పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఏలూరు రేంజ్ డి ఐ జి పాలరాజు.
ఈ కేసు పై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటా అని రావులపాలెం సీఐ మరియు ఎస్ ఐ లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
కొత్తపేట నియోజకవర్గం…
రావులపాలెం మండలం గోపాలపురం లో జరిగిన సంఘటన లో భాగంగా 18 మంది యువకులపై దౌర్జన్యంగా పెట్టిన అక్రమ కేసుల కు బాధ్యత వహిస్తూ సిఐ,ఎసై లను సస్పెండ్ చేయాలంటూ నిరసన దీక్షలు చిర్ల జగ్గిరెడ్డి చేపట్టారు వారికి మద్దతుగా అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ వైసిపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు స్టేషన్ కు చేరుకుని. 18 మంది యువకులు పై కేసు ఎత్తేయలంటూ డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న ఏలూరు రేంజ్ డి ఐ జి పాలరాజు ఐపీఎస్ రావులపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆయన విలేకరులతో మాట్లాడుతూ రావులపాలెం కాదు చాలా చోట్ల అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన ప్లేట్ల సమస్య మా దిష్టికొచ్చినట్లు దీనిపై వెంటనే చర్యలు చేపడతామని స్థానికంగా సీఐ వెంకటనారాయణ ఎస్ఐ భాను ప్రసాద్ లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు ఆయన తెలిపారు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు అనంతరం రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు నినాదాలు చేశారు…….