– పురుషోత్తపట్నం ఎయిడెడ్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ
– జగన్ మామా థాంక్యూ అంటూ ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా కనుక విద్యార్ధులకు వరమని పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్దా ఆదినారాయణ , గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి అన్నారు. ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. జగన్ మామా థాంక్యు అంటు విద్యార్థులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపీ సీనియర్ నాయకులు అన్నెం జయచంద్రారెడ్డి , ఉపాధ్యాయురాలు , విద్యార్థులు పాల్గొన్నారు.