WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సంఘ సంస్కర్త గాలిగాని రాజయ్యకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ఎంపిక…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి వ్యవస్థాపకులు సంఘ సేవ సంస్కర్త గాలిగాని రాజయ్యకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అవార్డు సెలెక్షన్ కమిటి నేషనల్ చైర్మన్ మరియు బి.ఎస్.ఎ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వానపత్రాన్ని హైదరాబాద్ లోని సంఘ సేవ సంస్కర్త గాలిగాని రాజయ్యకు బహుజన సాహిత్య అకాడమి జాతీయ కార్యాలయం లో అందజేశారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, హైదరాబాద్:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి వ్యవస్థాపకులు సంఘ సేవ సంస్కర్త గాలిగాని రాజయ్యకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అవార్డు సెలెక్షన్ కమిటి నేషనల్ చైర్మన్ మరియు బి.ఎస్.ఎ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వానపత్రాన్ని హైదరాబాద్ లోని సంఘ సేవ సంస్కర్త గాలిగాని రాజయ్యకు బహుజన సాహిత్య అకాడమి జాతీయ కార్యాలయం లో అందజేశారు.ఈ సంధర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ ఎస్.సి,ఎస్.టి,బి.సి,మరియు మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు,సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్చంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు.ఈ సంవత్సరం నవంబర్ 13వ తేదిన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగే ఆల్న్ఇండియా బహుజన రైటర్స్ 3వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగ డా బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు.రాజయ్య ఒమన్ మస్కట్ లో గత ఏడు సంవత్సరాల నుంచి అంబేద్కర్ సేవా సమితి సేవలు అందిస్తున్నారు.ఈయన ప్రమాదంలో మరణించిన వారిని పార్థివ దేహాలను ఇండియా కు తరలించడం పేదలకు ధనసహాయం అండించడం వారికి టిక్కెట్ లకు ఇవ్వడం, కరోనా సమయంలో ఎంతోమందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది, మస్కట్లో హార్ట్ ఎటాక్ మరణించిన రాజన్న సిరిసిల్ల వేములవాడ కోడిముంజ గ్రామం వాసికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం, లింగన్నపేట గ్రామవాసికి మస్కట్ నుండి హైదరాబాద్ రావడానికి టికెట్ కు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఏడు సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మహనీయుల జయంతులు, వర్ధంతులు చేయడం, అతని సేవలు గుర్తించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ఎంపిక చేయడం పట్ల పలువురు ప్రముఖులు అభిమానుల ఆయనను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.ఈ అవార్డ్ ప్రధానోత్సవానికి భారతదేశ నలుమూలల నుండి 26 రాష్ట్రాల వరకు సుమారుగా 2000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కీ హాజరవుతారని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలోతెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.యం. గౌతమ్,రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement