విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:
రాజమహేంద్రవరం, క్రైం విశ్వం వాయిస్ న్యూస్:
స్థానిక దిశా పోలీస్ స్టేషన్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పి (లా మరియు ఆర్డర్) ఎం.రజని సైబర్ మోసాలు గురించి మాట్లాడుతూ సులభంగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో కొంతమంది ప్రజలు, విధ్యార్ధులు,వ్యాపారస్థులు ఈ రుణయాప్లకు అకర్షితులవుతున్నారని,తీరా రుణాలు తీసుకున్నాక అధిక వడ్డీ మరియు వివిద అసంబధ్ధమైన చార్జీల పేరిట యాప్ నిర్వహకులు రుణ గ్రహీతల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్ళకు పాల్పడు తున్నారని,ప్రజలు రుణాలు తిరిగి చెల్లించే విషయంలో యాప్ నిర్వహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని,రుణ గ్రహీతల ఫోన్ల నుండి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దానిని దుర్వినియోగం చేయడం జరుగుతోందని, అదేవిధంగా వారి ఫోన్ల నుండి సేకరించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలమైన ఫోటోలు మరియు వీడియోలను వారి ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు పంపిస్తామని బెదిరిస్తూ,దుర్భాష లాడుతూ వేధించడం జరుగుతుందని తెలియ చేసారు.ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్ నుండి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురౌవుతారని,ప్రజలు కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన బ్యాంకులు,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద వ్యక్తిగతంగా హాజరై మాత్రమే రుణాలు తీసుకోవాలని తెలియచేసారు. ముఖ్యంగా ప్రజలు చెప్పుడు మాటలు విని తమ వ్యక్తిగత సమాచారం,బ్యాంక్,అధార్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియజేయవద్దని తెలిపారు.ఇలాంటి నకిలీ యాప్స్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన ఈ రుణాల విషయంలో వేధింపులకు గురిచేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు,డయల్-100కు కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి క్రైమ్స్ జి. వెంకటేశ్వరరావు,సౌత్ జోన్ డిఎస్పి ఎం శ్రీలత, సి.ఐ ధవళేశ్వరం కె.మంగాదేవి ఈ సమావేశానికి హాజరైనారు.