– సిబ్బందే స్వయంగా పర్యవేక్షణ
– విస్మయానికి గురైన ప్రజలు
– చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
:ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థ పని తీరు పట్ల ప్రజలు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామ సచివాలయాలు వందకు పైగా పౌర సేవలు అందించాల్సి వుండగా, కొన్ని సచివాలయాల పని తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, ప్రజల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నారని, సిబ్బంది చేతివాటం కూడా ఎక్కువౌతోందని వివిధ విమర్శలు వినిపిస్తున్న వేళ ఒక సచివాలయం ఏకంగా ప్రైవేట్ ఫంక్షన్ హాలు , ప్రభుత్వ సిబ్బంది వేడుకల నిర్వాహకుల కింద మారిన తీరు , ప్రజలను విస్మయానికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే, రాయవరం మండలం మాచవరం గ్రామం సచివాలయం–1 సిబ్బంది పనితీరు గ్రామ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుని పుట్టినరోజు వేడుకలు శుక్రవారం గ్రామ సచివాలయం నందు వారి కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న వేళ నివారించవలసిన కార్యదర్శి సచివాలయ సిబ్బంది వారితో కలిసి మరి వేడుకలు జరుపుకోవడం గ్రామ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజలకు 24 గంటలు సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయ సిబ్బందే , తమ తమ విధులకు స్వస్తి పలికి,ఏకంగా సచివాలయ కార్యాలయ భవనంలో డెకరేషన్ చేసి ఆ నాయకుని జన్మదినోత్సవ వేడుకలను దగ్గరుండీ మరీ జరిపించారు. ఎంత అధికారంలో వున్న పార్టీకి చెందిన నాయకుడైతే మాత్రం ఏకంగా సచివాలయంలో అట్టహాసంగా ప్రైవేటు వేడుకలు జరుపుకోవడం పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.