విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం మండలం:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం.
విశ్వం వాయిస్ న్యూస్ రీడర్
ఉప్పలగుప్తం మండలం షెడ్యూల్డ్ క్యాస్ట్ సంక్షేమ సంఘం, ఉప్పలగుప్తం శాఖ అధ్యక్షులు పుల్లెల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో 2022 ప్రభుత్వoవివిధ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వం వారిస్తున్న ఉత్తమ ప్రతిభా పురస్కారాలలో భాగంగా జిల్లా ఉత్తమ ప్రతిభావంతులైన ఉద్యోగులను,ఆసంఘo ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. సన్మాన గ్రహితలలో ఉప్పలగుప్తం మండల విద్యాశాఖ అధికారి కే కిరణ్ బాబు, భీమనపల్లి జడ్పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయులు ఆర్ వెంకటేశ్వరరావు, కూనవరం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్ అజయ్ కుమార్ లను అమలాపురం డివిజన్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు బత్తుల నకుల్ రాజు,గోసంగి బంగార్రాజు చేతుల మీదుగా దుస్సాలువ, మెమెంటో లతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సహకరిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి రవికుమార్, ఆర్థిక కార్యదర్శి కే శేషగిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ గంగాధర్, సంఘ గౌరవ సలహాదారు బివిఆర్ ప్రసాద్, వారా బాలయోగి, కే నవీన్ సంఘ సభ్యులు కొండలరావు, రాజేష్ బుజ్జి బాబు, మురళి చంద్రశేఖర్, బాలకృష్ణ రాంబాబు, రమేష్, ప్రదీప్, సుధాకర్, తదితరులు అవార్డు గ్రహీతలను అభినందించారు