WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అమ్మదయ అందరి పైన ఉండాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

అమ్మ దయ అందరిపైనా ఉండాలి

 

– 89 వ దేవీచౌక్ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించిన ఎంపీ భరత్

పాల్గొన్న శాసనసభ్యులు గోరంట్ల, ఆధిరెడ్డి భవాని

 

 

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్ :

 

జగన్మాత ఆ చల్లని తల్లి విజయదుర్గమ్మ కరుణా కటాక్షాలు అందరిపైనా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. సోమవారం ఆయన సతీ సమేతంగా నగరంలోని వివిధ ప్రధాన జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన శ్రీ దేవీ శరన్నవరాత్రి ప్రారంభోత్సవాలకు వెళ్ళారు. తొలుత రాజమండ్రి నగరంలో అత్యంత మహిమాన్వితురాలిగా వినుతికెక్కిన దేవీ చౌక్ వద్ద శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఎంపీ భరత్ ప్రారంభించారు. అమ్మవారికి ఎంపీ భరత్ దంపతులు విశేషార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులకు పండితులు వేదాశీస్సులు అందజేశారు. ఉత్సవ కమిటీ ఎంపీ భరత్ రామ్ దంపతులను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. అటు తరువాత కోటిపల్లి బస్టాండు పెట్రోల్ బంక్ పక్కన శ్రీ కనకదుర్గా టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం, మంగళవారపు పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద, నగరంలోని పనస చెట్టు సెంటర్ దానవాయి బాబు గుడి వద్ద, జేఎన్ రోడ్డు శ్రీ స్వర్ణ దుర్గ నవరాత్రి మహోత్సవాలలో, క్వారీ సెంటర్ వద్ద (47 వ డివిజన్) నవ చండీ పూర్వక పంచమి శరన్నవరాత్రి ఉత్సవాలు, రాజమండ్రి రూరల్ కాతేరు శాంతినగర్ వద్ద, నగరంలోని గోదావరి గట్టు శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయం వద్ద పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించే దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి చెందేలా అందుకు అవసరమైన శక్తిని, ఆరోగ్యాన్ని ముఖ్యమంత్రి జగనన్నకు ప్రసాదించమని కోరినట్టు చెప్పారు. అలాగే దేశం, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని, అందుకు ఆ తల్లి కరుణా కటాక్షాలు సర్వ జీవులపైనా పరిపూర్ణంగా ఉండాలని అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మను నిండు మనసుతో కొలిచినట్టు ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

89 వ వార్షికోత్సవ దేవీ నవరాత్రి మహోత్సవములో పాల్గొన్న- గోరంట్ల దంపతులు

 

దేవి నవరాత్రుల ప్రారంభం సందర్భంగా స్థానిక దేవిచౌక్ సెంటర్ లో తొలిరోజైనా సోమవారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా

గోరంట్ల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవీ చౌక సెంటర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలను కమిటీ ఘనంగా నిర్వహించడం అభినందనీయమని..

అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని గోరంట్ల ఆకాంక్షించారు.

 

 

దేవిచౌక్ అమ్మవారిని దర్శించుకున్న-నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని

 

దసరా ఉత్సవాలకు పెట్టింది పేరైన దేవిచౌక్ లో వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా మహోత్సవ ప్రారంభ వేడుకల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజు అయిన సోమవారం ఉదయం దేవిచౌక్ అమ్మవారిని ఎమ్మెల్యే భవాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కష్టాలన్నీ తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఉండేలా దీవించాలంటూ అమ్మవారిని ఎమ్మెల్యే భవాని వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే భవానీని ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో సాదరంగా ఆహ్వానించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఘనంగా సత్కరించి అమ్మవారి వద్ద ఉంచిన గాజులు పసుపు కుంకుమలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యురాలు ద్వారా పార్వతి సుందరి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే భవాని హాజరై పూజలు చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement