విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
శ్రీ పీఠంలో ముగిసిన శరన్నవరాత్రి మహోత్సవాలు
శ్రీనివాసునిగా దర్శనమిచ్చిన ఐశ్వర్యంబికా అమ్మవారు
కంచిపీఠాధిపతి రాక.. భక్తులకు అభిభాషణ.
కాకినాడ రూరల్,విశ్వం వాయిస్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కాకినాడ శ్రీపీఠం ఐశ్వర్యంబికా అమ్మవారి ఆలయంలో
అత్యంత వైభవంగా ఘనంగా ముగిశాయి.ఏకాదశి పర్వదినం రోజున ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీనివాసునిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద ప్రత్యేక ఆహ్వానం మేరకు కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి గురువారం శ్రీపీఠానికి వేంచేసి ఐశ్వర్యంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అభిభాషణ చేశారు. తిరుమల, ద్వారకా తిరుమల తరువాత శ్రీపీఠంలో శ్రీనివాసుని రూపంలో బ్రహ్మోత్సవాల తరహాలో భక్తులకు దర్శనమిచ్చారని శ్లాఘించారు. హిందూ ధర్మ పరిరక్షణ, సమాజానికి మేలు చేసేందుకు ఇటువంటి మహోత్సవాలు దోహదం చేస్తాయని, ప్రతిఒక్కరు ధర్మాచారం పాటిస్తూ,ప్రతిఒక్కరు బాగుండాలని సూచించారు. దేవీ నవరాత్రుల దశమితో అన్నిచోట్ల ముగుస్తాయి స్వామి పరిపూర్ణానంద స్వామీజీ శ్రీ పీఠంలో మాత్రం ఏకాశి పర్వదిన సందర్భంగా ఐశ్వర్యాంబిక అమ్మవారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అవతారంతో ముగియడం విశేషం. ఈ అలంకారాన్ని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఉదయం 11 గంటల నుండి మూడు గంటల వరకు అన్నప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారు వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారం చూడడానికి కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ విచ్చేసి సంభమాత్సర్యానికి గురయ్యారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగితే అదే విధంగా పరిపూర్ణానంద స్వామీజీ కాకినాడలో ఐశ్వర్యాంబిక అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం చాలా ఆనందదాయమన్నారు.ధర్మ పరిరక్షణకు పరిపూర్ణానంద స్వామీజీ చేస్తున్న కృషికి తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. అనంతరం మహిళలకు సౌభాగ్య తాంబూలాలను అందజేశారు.