ఈనెల 30 తేదీన జరగబోవు రాయలసీమ తిరుపతి బహుజన రాజ్యాధికార సభ కర పత్రాలు నియోజకవర్గ కమిటీ సమక్షంలో విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల నరసింహం మాట్లాడుతూ ఈయొక్క రాజ్యాధికార సభకు నియోజకవర్గం నుండి అధికసంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్ళి ఆయొక్క సభను విజయవంతం చేయాలని బీఎస్పీ కార్యకర్తలకు చూచించడం జరిగింది.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
రాజ్యాధికార సభకు నియోజకవర్గం నుండి అధికసంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్ళిలి.
బిఎస్పీ పార్టీని బలోపేతం చేయండి.
అంబాజీపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
అంబాజీపేటబ హుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో, పి. గన్నవరం నియోజకవర్గ కమిటీ బహుజన సమాజ్ పార్టీ సమావేశం ఆదివారం నియోజకవర్గ అధ్యక్షులు జంగా కృష్ణ మూర్తి (రిటైర్డ్ టీచర్ ) అధ్యక్షతన జరిగింది. .ఈ సమావేశమునకు డా, బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కాండ్రేగుల నరసింహం ,జిల్లా ఉపాధ్యక్షుడు జిత్తుక సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 30 తేదీన జరగబోవు రాయలసీమ తిరుపతి బహుజన రాజ్యాధికార సభ కర పత్రాలు నియోజకవర్గ కమిటీ సమక్షంలో విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల నరసింహం మాట్లాడుతూ ఈయొక్క రాజ్యాధికార సభకు నియోజకవర్గం నుండి అధికసంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్ళి ఆయొక్క సభను విజయవంతం చేయాలని బీఎస్పీ కార్యకర్తలకు చూచించడం జరిగింది. పి.గన్నవరం బీఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ కుసుమ వెంకటేశ్వర రావు, మరొక్క కన్వీనర్ గెడ్డం రాజేష్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాడి రాంబాబు,నియోజకవర్గ కార్యదర్శి మాగాపు ఈశ్వర రావు, అంబాజీపేట మండల బీఎస్పీ అధ్యక్షుడు ములపర్తి చందు, మామిడికుదురు మండల బీఎస్పీ అధ్యక్షుడు తాడి రమేష్,పి.గన్నవరం మండల బీఎస్పీ ప్రధాన కార్యదర్శి నేలపూడి లెనిన్, ఉప్పె శ్రీనివాస్, కొట్టాల నరసింహ మూర్తి, కొంబత్తుల గోవింద రాజులు,పెట్టా సత్య ప్రసాద్,కొంబత్తుల వెంకటేశ్వర రావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉన్నారు.