మన పిల్లల భవిష్యత్తు కోసం వారి కష్టం ని గుర్తించి
సంఘిభావం తెలిపి వారికీ మద్దత్తు గా నిలబడాలి అని కోరుకుంటున్నను,
– అను శ్రీ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
ప్రజా రాజధాని, భావితరాల యువత భవిష్యత్ కోసం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర అమరావతి నుండి అరసవిల్లి మహా పాద యాత్ర ను ప్రజలు అందరు స్వచ్ఛందంగా వచ్చి మీ మాధ్ధతి తెలియజేయాలి అని అనుశ్రీ సత్యనారాయణ పిలుపు ఇచ్చారు.అనుశ్రీ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 8.00 గంటలకు పేపర్ మిల్ నుండి ప్రారంభం అయ్యే ఈ పాదయాత్ర సీతంపేట,గోకవరం బస్సు స్టాండ్,దేవిచౌక్,గీత అప్సర,సాయికృష్ణ థియేటర్,కోటిపల్లి బస్టాండ్ మీదుగా స్టేడియం కి చేరుకొని అక్కడ భోజనం విశ్రాంతి తీస్కొని అక్కడ నుండి తాడితోట,షెల్టన్ హోటల్,గోరక్షణ పేట,జే ఎన్ రోడ్,ఎ.వి అప్పారావు రోడ్,తిలక్ రోడ్, మీదుగావీ ఎల్ పురం చేరుకుంటుంది కావున ప్రజలు అందరు మీ సహాయం మీ సమయం మన పిల్లల భవిష్యత్తు కోసం వారి కష్టం ని గుర్తించి సంగిభావం తెలిపి వారికీ మద్దత్తు గా నిలబడాలి అని కోరుకుంటున్నను, ముందు అమరావతే రాజధాని అని ఒప్పుకున్న జగన్ ప్రజలని ఏ విధంగా మోసం చేసారో ఈ పాదయాత్రలో వారి కష్టం వింటే తెలుస్తుంది అన్నారు.ఈ విషయాలు అన్ని ప్రజలు గమనించాలని,మా పార్టీ అధ్యక్షులు చెప్పిన విధంగా అమరావతే శాశ్వత రాజధాని అవుతుంది అని అనుశ్రీ గంట పదం గా చెప్పారు.అదే సరైన నిర్ణయం అని ప్రజలు అందరు మధ్ధతు తెలిపాలి అని ప్రజలు అందరు దీనికి అండగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.