WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం పటిష్టంగా అమలు…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఉత్తర్వులు నిషేధిస్తే కఠిన చర్యలు

– పర్యావరణాన్ని కాపాడేందుకు మరింత క్రియాశీలక నిర్ణయాలు తెస్తామన్న సి ఎం

– గతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విఫలం?

– ఆ నిషేధం అమలు చేసాకే ఫ్లెక్సీల జోలికి రావాలంటున్న నేతలు

– వ్యాపారస్థుల ఆదాయానికి భారీగా గండి

– ప్రచారాన్ని అణగదొక్కేందుకే నిషేధాస్త్రం అంటున్న విపక్షాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

ఏపీ ప్రభుత్వం నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల దిగుమతి, ఉత్పత్తికి అనుమతి లేదని పేర్కొంది.

 

ఫ్లెక్సీల వినియోగం, ప్రదర్శన, ముద్రణ, రవాణా వంటివాటిపై నిషేధం వర్తిస్తుంది. గ్రామ స్థాయి నుండి ఈ నిర్ణయాన్ని క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధికారులు అమలు చేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు వుంటాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.ప్లాస్టిక్ ఫ్లెక్సీ బదులుగా కాటన్ ఫ్లెక్సీలు, నేత వస్త్రాలు వాడాలని సూచించింది.

 

సీఎం జగన్ ఇటీవల విశాఖపట్నంలో బీచ్ లో వ్యర్థాలను వేరుచేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై తన బ్యానర్లు సైతం ప్లాస్టిక్ వి ఎక్కడ కనిపించినా వెంటనే చింపివేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా తెలిపారు.

 

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ప్లెక్సీలు బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. ఎవరైనా ప్లెక్సీలు పెట్టాలనుకుంటే బట్టతో తయారు చేసినవి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. టీటీడీలో ఇప్పటికే ప్లాస్టిక్‌ 100 శాతం లేకుండా చేశారని అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని, అతి త్వరలో తిరుపతి నగరం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటింపబడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆ దిశగా అడుగులు వేద్దామని ఇందులో ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, పర్యావరణ వేత్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయంలో భాగంగా.. నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సిల నిషేధం అమల్లోకి రానుంది.

 

 

రాష్ట్రవ్యాప్తంగా 4,097 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. ఈ రోజు సముద్రాలను పరిశీలిస్తే..ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కనిపిస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్ధాలపై పెద్ద ఎత్తున భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని, ప్రపంచంలో ప్రాణాంతక మూత్ర పిండాల వ్యాధులు, కేన్సర్ వ్యాధికి విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగమే ప్రధాన కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి భవిష్యత్తులో ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని నిర్మించకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించిందని,వీటికి ఒక పరిష్కారం వెతికే దిశగా ఏపీ ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించి అడుగులు ముందుకు వేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు కంపెనీలను భాగస్వాములుగా ఆహ్వానించిందని.. ఒకటి గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టేయినబుల్‌ ప్లానెట్‌ వర్క్స్‌(జీఏఎస్‌పీ), మరొకటి పార్లే ఓషన్స్‌ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆయా సంస్థలు గ్లోబల్‌ ఫైనాన్స్‌ తీసుకువచ్చి పర్యావరణాన్ని కాపాడే విధంగా పని చేస్తాయని చెప్పుకొచ్చారు.

 

భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మన సంకల్పంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాలని జగన్ పిలుపునిచ్చారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలన్నారాయన. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశాం అని సీఎం జగన్‌ తెలిపారు.

 

ఇంతవరకు బాగానే వుంది. అసలు సమస్య అంతా ఈ నిషేధం అమలులోనే వుంది. ఇతర నిషేధాల వలె ఈ అమలు కేవలం ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తుందా లేక అధికార పక్షంకూడా సి ఎం పిలుపు మేరకు స్పందించి స్వచ్చంధంగా అమలు చేస్తారా అన్నదే అసలు ప్రశ్న. ఇటీవలి కాలంలో ఫ్లెక్సీల వాడకం కొండంతలుగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజకీయ నేతలు ప్రతీ చిన్న సందర్భానికి ఊరంతా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కడుతూ తమ ప్రాముఖ్యతను చాటుకుంటున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక ఆ ఫ్లెక్సీలను ఒక మూలగా లేదా చెరువులలో పడేస్తున్నారు. ఇందువలన పర్యావరణానికి ప్పెను ముప్పు కలుగుతోంది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలను కంప్యూటర్ ద్వారా ముద్రించడం చాలా సులువు. అయితే ఇంత హంగూ ఆర్భాటాలకు అలవాటు పడిన నేతలు వీటిని వాడడం మానేస్తారా లేదా నిషేదం పట్టించుకోకుండా యధావిధిగా తమ పని చేసుకుపోతారా అన్నది పీఉడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. టిడిపి , జనసేన, బి జె పి నేతలు మాత్రం ఈ నిషేధం ప్రతిపక్ష పార్టీలను ప్రచారం చేయకుండా నిషేదించేందుకే తెచ్చారని, అధికారులు అధికార పక్షానికి పూర్తి వెసులుబాటు ఇస్తారని పెదవి విరుస్తున్నారు.

 

 

 

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. ఆ జాబితాలో ఈయర్ బర్డ్స్, బెలూన్లు, కేండీలు,ఐస్ క్రీమ్ కు ఉపయోగించే ప్లాస్టిక్ పుల్లలు, కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, ఫోర్కులు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీటు బాక్సులను చేర్చింది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని వినియోగించకూడదని ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ వినియోగిస్తే కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆదేశాలిచ్చింది. అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.అయితే ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా వాటి వినియోగం మాత్రం తగ్గడం లేదు. ఎక్కడికక్కడే వీటి వినియోగం కనిపిస్తోంది. విక్రయాలు జరుగుతున్నాయి. కనీసం అధికారులు వీటిపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మాత్రం రాజకీయ నాయకులకు ఉపయోగపడే ఫ్లెక్సీలు, బ్యానర్లుపై మాత్రమే ప్రకటన చేయడం వారికి మింగుడు పడడం లేదు.

 

 

కానీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లు అందుబాటులోకి వచ్చిన తరువాత గంటల వ్యవధిలో అందుబాటులోకి వస్తున్నాయి. కార్యక్రమ నిర్వహణకు గంట ముందు ఆర్డర్ చేసుకున్నా ఇంటికి చేరుతున్నారు. పైగా గుడ్డ సంచుల బ్యానర్లతో పోల్చుకుంటే వీటికి నాణ్యతా ప్రమాణాలు కూడా ఎక్కువే. అటు ఎన్నికల సమయంలో కూడా ఇవి ప్రధాన భూమిక వహిస్తూ వస్తున్నాయి. తమ అభిప్రాయాన్ని నేతలు ప్రజలకు తెలియజెప్పే సాధనంగా మారాయి. అటువంటి ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించడం మాత్రం నేతలకు మింగుడుపడడం లేదు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement