కూర్మాపురం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తోట…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
మండపేట నియోజకవర్గం లో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య క్లినిక్లు సచివాలయ భవనాలు నాడు నేడు పథకంలో పాఠశాల ఆధునీకరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండలం కూర్మాపురం గ్రామంలో సర్పంచ్ చౌటపల్లి చక్రవేణి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండపేట వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లడుతూ గత ఏ ప్రభుత్వాలు ఇవ్వని సంక్షేమ పథకాలు ఒక్క వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని పేర్కొన్నారు. ప్రజలంతా ఎంతో ఆనందంతో ఉన్నారని పేర్కొన్నారు.
అర్హులైన వారు ఎవరైనా ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే తనకు తెలియజేస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. గ్రామాలలో అభివృద్ధిని చూడలేని కళ్ళు లేని కబోది ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరావు తోట అన్నారు. తోలితగా ఏమ్మేల్సీ చేతుల మీదుగా నాడు నేడు పేజ్ 2 లో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 39 లక్షల తో రెండు అదనపు తరగతి గదులు, 42లక్షల తో నాడు నేడు పేజ్ 2 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 25 లక్షలతో నూతన సచివాలయ భవనము, 50 లక్షలతో సొసైటీ మరియు గోడౌన్ భవనము, 5 లక్షల బేద్కర్ భవనము, ఎం పి పి మెయిన్ స్కూల్ ఫేజ్ 1 లో 16 లక్షల తో నాడు నేడు పనులకు శంకుస్థాపన, పేజ్ 1 లో 16 లక్షల 68 తో నిర్మితమైన అప్పర్ ప్రైమరీ స్కూల్ భవనము ప్రారంభోత్సవములు చేశారు. అనంతరం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ త్రిమూర్తులకు సర్పంచ్ చక్రవేణి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎం పి పి నౌడు వెంకటరమణ, జెడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి లతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేశారు. కరపత్రాలను ఆయా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో అడుగడుగునా ఎమ్మెల్సీ త్రిమూర్తులకు అక్కడ ప్రజలు హారతిలిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు, మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు చిన్నం అపర్ణ దేవి పుల్లేషు, ఎంపీటీసీ వెంకటలక్ష్మి సూరిబాబు, పిఎసిఎస్ చైర్మన్ కందర్ప భానుమతి, వైఎస్ఆర్సిపి గ్రామ శాఖ అధ్యక్షులు పి వెంకటరమణమూర్తి, ఉప సర్పంచ్ ఈతకోట లక్ష్మణరావు, ఎంపీడీవో డి శ్రీనివాస్, తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, హౌసింగ్ ఏఈ ఏ శ్రీనివాస్ రెడ్డి, వెలుగు ఏపిఎం నాజర్, కొలగాని సత్తిబాబు, ఎన్ మధు బాబు ఆయ మండలాల ఎం పి పి లు, జెడ్పిటిసిలు , సర్పంచ్ లు, ఎం పి టిసి లు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.