విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
నెహ్రూ అడుగుజాడల్లో చిన్నారులంతా నడిచి, దేశ అభివృద్ధికి పాటుపడాలని క చాణిక్య హాస్పిటల్ అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో సాయి తేజ విద్యానికేతన్ పాఠశాలలో అకాడమిక్ డైరెక్టర్ కర్రీ భానురేఖ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక చాణిక్య హాస్పిటల్ అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి ఎస్ ఎన్ రెడ్డి విద్యార్థులకు బాలల దినోత్సవ సందేశాన్ని అందించారు. పండిట్ నెహ్రూ మరువలేని స్వాతంత్ర సమరయోధుడు అని తెలిపారు. నేటి బాలలే భావి భారత పౌరులని అన్నారు. అలాగే చాచా నెహ్రూ అడుగుజాడల్లో చిన్నారులంతా నడిచి, దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన అబ్దుల్ కలాం టాలెంట్ క్విజ్ పోటీలలో డిస్టిక్ లెవెల్ లో 28 పాఠశాలలు పోటీ పడగా రాయవరం గ్రామానికి చెందిన సాయి తేజ విద్యానికేతన్ స్కూలు చెందిన ఐదుగురు విద్యార్థినీలకు జిల్లాస్థాయిలో మొదటి బహుమతి రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు .సాయి తేజ విద్యానికేతన్ స్కూలు లో ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ 28 , 29 తేదీలలో సాయి తేజ విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ కర్రి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నమూనాలు ఎక్స్పో పేరిట రెండు రోజులు పాటు సైన్స్ఫేర్ నిర్వహించారు.. పిల్లలు తమ విజ్ఞాన ప్రతిభను వాళ్ల వాళ్ల సైన్స్ ప్రాజెక్ట్ లలో అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు. విద్యార్థులు విద్యార్థినిలు సుమారు 400 మంది తో 185 ప్రాజెక్టులు ప్రదర్శించగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సాయి తేజ విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు డాన్సులు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు .ఈ కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి విద్యార్థిని విద్యార్థులు కేరింతలతో ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు .ఈ కార్యక్రమంలో సాయి తేజ విద్యానికేతన్ అకాడమిక్ డైరెక్టర్ కర్రి భానురేఖ సందీప్ రెడ్డి, కరస్పాండెంట్ కర్రీ సూర్యనారాయణరెడ్డి, డైరెక్టర్ కర్రి పద్మావతి , ఏఓ పోలిమాటి సుధాకర్,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.