ఆర్డిఓ ముక్కంటి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట:
కొత్తపేట, విశ్వంవాయిస్ : రైతులు తమ ధాన్యాన్ని మరింత సులువుగా అమ్ముకునేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు కొత్తపేట ఆర్డిఓ ఎం. ముక్కంటి తెలిపారు. కొత్తపేట రెవిన్యూ డివిజన్ లో గల ఏడు మండలాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ప్రభుత్వం స్వయంగా వాహనాలు, జట్టు కూలీలు, గోనె సంచులు సమకూర్చి ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామని ఆర్టీవో సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రాపు బుక్ చేయించుకున్న రైతులు ఆర్ బి కే నందు పేరు నమోదు చేయించుకున్న వారి భూమి విస్తీర్ణంలో పండిన ధాన్యానికి సరిపడా గోనె సంచులు సరఫరా చేస్తామన్నారు. ఒక ఆర్.బి.కె కి చెందిన రైతుల ధాన్యాన్ని ఒకే వాహనంలో ఒకే మిల్లుకు తరలించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఒక లారీలో పదిమంది రైతులకు చెందిన ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటే, వారి వ్యక్తిగత ఎఫ్టీఓలు జనరేట్ చేసి వారందరి ధాన్యం ఒకే మిల్లుకు ఒకే వాహనంలో తరలిస్తామన్నారు. రైతులకు ఏ విధమైన సందేహాలు ఉన్నా స్థానిక రైతు భరోసా కేంద్రాల వద్ద సంప్రదించాలని సూచించారు.